ఆమె నా చెంప పగలగొట్టింది.. కారణం చిరంజీవే.. ఓపెన్ అయిన పూరి జగన్నాథ్

మెగాస్టార్ చిరంజీవి కారణంగా తన భార్య కోపానికి గురికావలసి వచ్చిందని అంటున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. అంతేకాదు చిరంజీవి చేసిన పనికి ఆమె తన చెంప పగలగొట్టిందని అన్నారు. ఇంతకీ చిరంజీవి ఏం చేశారు? పూరి ఎందుకలా అంటున్నారు? ఆ వివరాలు చూద్దామా..

Recommended Video

Puri Jagannath's Wife Slapped Him & The Reason Is Megastar Chiranjeevi
 అక్కడ కూడా మెగాస్టార్..

అక్కడ కూడా మెగాస్టార్..

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకపై సామాజిక మాద్యమాల్లోనూ టచ్‌లో ఉంటూ తన అభిప్రాయాలను పంచుకుంటా అని చెప్పిన చిరంజీవి.. ఇన్స్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలను ఓపెన్ చేశారు. ఈ మేరకు సదరు వేదికలపై యాక్టివ్‌గా ఉంటూ టాలీవుడ్ ప్రముఖుల విషయాలు, ఇతర సంగతులు చెబుతున్నారు.

అదే కొంపముంచింది

అదే కొంపముంచింది

చిరనేజీవి ట్విట్టర్ ఎంట్రీ ఇచ్చాక ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ ట్వీట్ చేశారు పూరి జగన్నాథ్. ఆయన చేసిన ఈ మెసేజ్ చూసిన చిరంజీవి.. 'నువ్వు బ్యాంకాక్ మిస్ అవుతున్నావ్ కదా! నువ్విలా ఇంట్లోనే గడపడం ద్వారా పవిత్ర, ఆకాష్ చాలా సంతోష పడుతున్నారు' అని కామెంట్ చేశారు. అయితే అదే తన కొంపముంచింది అంటున్నారు పూరి జగన్నాథ్.

అందుకే నా భార్య చెంప పగలగొట్టింది

అందుకే నా భార్య చెంప పగలగొట్టింది

గతంలో పూరి కొత్త సినిమా మొదలు పెట్టారంటే ముందు బ్యాంకాక్ వెళ్లి రావాల్సిందే. అక్కడే కథ సిద్ధం చేసుకుని రావడం ఆయన సెంటిమెంట్. అయితే బ్యాంకాక్ వెళ్లి స్క్రిప్ట్ పనులు చేసినా పూరి డౌన్ ఫాల్ కావడంతో ఆయన అక్కడికెళ్ళడం మానేశారు. అందుకే చిరు ట్వీట్ చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకుని నా భార్య చెంప పగలగొట్టిందని పూరి చెప్పారు.

ఇస్మార్ట్‌గా పూరి ప్రయాణం

ఇస్మార్ట్‌గా పూరి ప్రయాణం

ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కొత్త సినిమా చేస్తున్నారు. ఫైటర్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే ముంబై షెడ్యూల్ పూర్తిచేసుకొని.. కరోనా కారణంగా తదుపరి షెడ్యూల్ షూటింగ్ వాయిదా వేసుకుంది.

ఫైటర్ మూవీ.. ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా!

ఫైటర్ మూవీ.. ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా!

శ్రీమతి లావణ్య సమర్పణలో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. బాక్సింగ్ సన్నివేశాల్లో రియాలిటీ ఉట్టిపడేందుకు గాను ఆయన శిక్షణ కూడా తీసుకున్నాడు. ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X