'రొమాంటిక్' లిప్ లాక్స్ రీ షూట్.. తనయుడి కోసం పూరి జగన్నాథ్ స్పెషల్ కేరింగ్!
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మొత్తానికి ఫామ్ లోకి వచ్చిన సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఏ మాత్రం మిస్సవ్వకూడదని జాగ్రత్తగా కథలు రాసుకుంటూ ఉన్నాడు. అసలైతే గతంలో ఈ దర్శకుడు జయపజయలతో సంబంధం లేకుండా వెంటవెంటనే సినిమాలు రిలీజ్ చేసేవాడు. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. ఆలస్యమయినా సరే మంచి సినిమాతో రావాలని ఫిక్స్ అయ్యాడు.

మెహబూబా దెబ్బ..
పూరి జగన్నాథ్ దాదాపు తెలుగులో అందరి హీరోలతో వర్క్ చేశాడు. ఇక ప్రతి ఒక్క హీరో కూడా పూరి జగన్నాథ్ తో మినిమామ్ సక్సెస్ అందుకున్నవారే. అయితే సొంత కొడుకు విషయంలో మాత్రం పూరి ఊహించని విధంగా మిస్టేక్ చేశారు. కుమారుడు ఆకాష్ పూరిని మెహబూబా సినిమాతో గ్రాండ్ గా లాంచ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా ఊహించని దెబ్బ కొట్టింది.

ఇస్మార్ట్ శంకర్ బూస్ట్..
ఫైనల్ గా పూరి జగన్నాథ్ కెరీర్ కి ఇస్మార్ట్ శంకర్ మరో బూస్ట్ ఇచ్చింది. రామ్ హీరోగా తెరకెక్కించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పూరి అసలు క్రేజ్ ని బయటపెట్టింది. దీంతో నెక్స్ట్ ఈ దర్శకుడి నుంచి రాబోయే సినిమాలకు తప్పకుండా ఒక మంచి బిజినెస్ అయితే ఏర్పడుతుంది. ఈ సారి కొడుకు సినిమాను తాను డైరెక్ట్ చేయకుండా తన స్టూడెంట్ కి ఇచ్చాడు. రొమాంటిక్ సినిమాను సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

రీ షూట్..
మెహబూబా దెబ్బ కొట్టడంతో రొమాంటిక్ సినిమాతో అయినా ఆకాష్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇవ్వాలని పూరి జగన్నాథ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దాదాపు షూటింగ్ ఎండింగ్ లో ఉండగా లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. అయితే సినిమా అవుట్ పుట్ పై సంతృప్తిగానే ఉన్న పూరి జగన్నాథ్ కొన్ని సీన్స్ పై మాత్రం అనుమానాలు వ్యక్తం చేశాడట. అందుకే రీ షూట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video

లిప్ లాక్స్ కోసం స్పెషల్ కేరింగ్..
మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ లవ్ స్టోరీస్ లో లిప్ లాక్స్ హైలెట్ గా ఉండనున్నాయట. ఆ సీన్స్ లో కొన్నిటిని పూరి జగన్నాథ్ స్వయంగా రీ షూట్ ప్లాన్ చేసినట్లు టాక్ వస్తోంది. ఇప్పటికే రిలీజైన హాట్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చూస్తుంటే ఆకాష్ బోల్డ్ కంటెంట్ తో ఫస్ట్ హిట్టు కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. అనిల్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











