'ఇస్మార్ట్ శంకర్' నుంచి 'ఉండిపో'.. అట్రాక్ట్ చేస్తున్న పూరి స్టైల్ రొమాంటిక్ సీన్స్
పూరి జగన్నాథ్ తాజా సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమాకు డబుల్ దిమాక్ అనే ట్యాగ్ లైన్ పెట్టిన పూరి.. అదే కోణంలో దిమాక్ ఖరాబ్ అయ్యేలా హీరో రామ్‌తో హై వోల్టేజ్ పర్ఫార్‌మెన్స్ చూపిస్తున్నాడు. చాలా కాలం తర్వాత తన పూర్తిస్థాయి మార్క్ కనిపించేలా ఇస్మార్ట్ శంకర్ సినిమాను రూపొందిస్తున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ఇస్మార్ట్ శంకర్ లిరికల్ సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా 'ఉండిపో' అంటూ సాగే మరో పాటను విడుదల చేశారు.
ఉండిపో.. ఉండిపో అంటూ అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించిన ఈ మెలోడీ పాటలో పూరి స్టైల్ రొమాంటిక్ సన్నివేశాలు కనిపించాయి. సంగీత ప్రియులని ఆకట్టుకుంటూ కుర్రకారుకు హుషారెత్తించే సీన్స్ ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు పూరి. హీరో రామ్, హీరోయిన్ నిధి అగర్వాల్ లపై చిత్రీకరించిన ఈ సాంగ్‌లో మణిశర్మ సమకూర్చిన మెలోడీ ట్యూన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి.

ఓ వైపు సినిమా షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ మొదలు పెట్టిన ఇస్మార్ట్ శంకర్ టీమ్ ఇప్పటికే భారీ క్రేజ్ కొట్టేసింది. ఇటీవలే ఫస్ట్ లిరికల్ సాంగ్ దిమాక్ ఖరాబ్ చేయగా, ఆ వెంటనే రెండో సాంగ్ ఇస్మార్ట్ శంకర్ కి జిందాబాద్ కొట్టించింది. అలాగే టైటిల్ సాంగ్ ఇస్మార్ట్ శంకర్ స్టైల్ ఏంటో తెలియజేసింది. ఈ మూడు పాటలే చిత్రంపై భారీ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన ఈ సాంగ్ ద్వారా వాటికి రెక్కలు కట్టారు పూరి, ఛార్మి.


Click it and Unblock the Notifications











