Liger ప్రీ రిలీజ్ ఈవెంటా? సక్సెస్ మీటా? అతడిని కొట్టే మొగాడే లేడు.. పూరీ జగన్నాథ్ ఎమోషనల్

సెన్సేషన్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, చార్మీ, విష్, పూరీ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈవెంట్‌లో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..

ఒక్కో టికెట్ కొంటే బ్లాక్ బస్టరే

ఒక్కో టికెట్ కొంటే బ్లాక్ బస్టరే


నమస్తే గుంటూరు. మిమల్నందరీని చూస్తే.. సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు వచ్చామా? సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్‌కు వచ్చామా అనే అనుమానం కలుగుతున్నది. మీరందరూ ఒక్కో టికెట్ కొంటే మా సినిమా బ్లాక్ బస్టర్. మీలో ఎంతమంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉన్నారు. నాకు చాలా మంది అమ్మాయిలే ఎక్కువ ఫ్యాన్స్‌ కనిపిస్తున్నారు అని పూరీ జగన్నాథ్ అన్నారు.

రమ్యకృష్ణ ఉతికి ఆరేసింది అంటూ

రమ్యకృష్ణ ఉతికి ఆరేసింది అంటూ


లైగర్ సినిమాలో విజయ్ ఇరగదీశాడు. అనన్య పాండే చింపేసింది. రమ్యకృష్ణ ఉరుకొంటుందా? ఆమె కూడా ఉతికి ఆరేసింది. ఈ సినిమాలో హైలెట్ మైక్ టైసన్. నేను ఆయన లెజెండ్. మైక్ టైసన్‌ను కొట్టే మొగాడు ఎవరు లేరు. మైక్ టైసన్‌ను కొట్టిన వాడి తర్వాత మరొకడు లేడు. అలాంటి వ్యక్తిని లైగర్‌లో నటించాడు అని పూరీ చెప్పాడు.

ఓ జర్నలిస్టు అలా అడిగాడు..

ఓ జర్నలిస్టు అలా అడిగాడు..


అయితే ముంబైలో జరిగిన లైగర్ ప్రమోషన్‌లో ఓ జర్నలిస్టు మైక్ టైసన్ ఎవరు అని అడిగాడు. దాంతో నేను చాలా హర్ట్ అయ్యాను. నేను చాలా కష్టపడి మైక్ టైసన్ ఒప్పించి ఈ సినిమాలో నటింప జేశాను. అలాంటి వ్యక్తి గురించి తెలియకపోవడం నిరుత్సాహం కలిగించింది. కాబట్టి మీరు మైక్ టైసన్ గురించి గూగుల్ చేయండి అని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.

మైక్ టైసన్ అంటే గొప్ప వ్యక్తి

మైక్ టైసన్ అంటే గొప్ప వ్యక్తి


మైక్ టైసన్ గొప్ప వ్యక్తి. లైగర్ సినిమా చూస్తే ఆయన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. ఈ సినిమాను మేము ప్రేమతో తీశాం. దానికి చిన్న ఉదాహరణ చెబుతాను. ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఎంత లాభం వస్తుందో తెలియదు. కానీ విజయ్‌తో ఇంతకంటే ఎక్కువ బడ్జెట్‌తో జనగణమన సినిమాను మొదలుపెట్టి ఒక షెడ్యూల్ పూర్తి చేశాను. సో అది మా లైగర్ సినిమాపై మా కాన్ఫిడెన్స్. మీ కాలేజ్ ప్రిన్స్‌పాల్‌ను కలిశాను. ఆగస్టు 25వ తేదీన వారిని హాలీడే అడిగి సినిమా చూడండి అని పూరీ అన్నాడు.

థియేటర్‌లోనే చూడండి అంటూ

థియేటర్‌లోనే చూడండి అంటూ


గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చాలా మంది కష్టపడ్డారు. ఈ సినిమాను తప్పక ఆదరించండి. ఈ ఈవెంట్ కోసం పోలీస్ డిపార్ట్‌మెంట్ చాలా కష్టపడ్డారు. వారందరికి నా ధన్యవాదాలు. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలోనే చూడండి అని పూరీ జగన్నాథ్ కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X