Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్‌జున్‌వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
ఈ రాత్రికి నీ కోసం మరో పెగ్ పడాల్సిందే.. అల్లు అర్జున్ మాటలకు పూరి చీర్స్!
రామ్ గోపాల్ వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ ఏం చెప్పినా కూడా వినాలనిపిస్తుంది. మంచి విషయాలని మంచిగా చెబితే ఎవడు వినడు. ఘాటుగా చెబితేనే వింటారు అనే ఫార్ములా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సినిమాల్లో డైలాగ్స్ కూడా ఎక్కడో గట్టిగానే తగిలేస్తాయి. మంచి విషయాలను మొండిగా కూడా చెప్పవచ్చు ఆయన రుజువు చేశారు. మొన్నటివరకు సినిమాలలోనే తన డైలాగ్స్ తో ఆలోచింప జేసిన పూరి ఇప్పుడు పోడ్ కాస్ట్ ఆడియోల ద్వారా ఆలోచింపజేస్తున్నాడు.
ఈజీగా మైండ్ కి ఎక్కేలా..
పూరి చెబుతున్న మాటలకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది. సమాజం గురించి మనుషుల ఆలోచనల గురించి అలాగే వివిధ రకాల కొత్త విషయాలను గురించి పూరి చాలా ఈజీగా మైండ్ కి ఎక్కేలా చెబుతున్నారు. ఇక ఇటీవల స్త్రీ అనే పదానికి అసలైన అర్దాన్ని చెప్పారు. అలాగే మిస్ ఇండియా ఆమె పదానికి కూడా సరైన పద్దతిలో వివరణ ఇచ్చారు.
వాళ్లే నిజమైన మిస్ ఇండియాలు
అందంగా ర్యాంప్ వాక్ లు చేసే ఆడవాళ్లకు కాకుండా.. మగాళ్ల సపోర్ట్ లేకుండా సొంతంగా వారి కళ్ళ మీద నిలబడిన వారికి పెట్టాలి ర్యాంప్ వాక్ లు. స్వతత్రంగా బ్రతికే ఆడవాళ్ళని సత్కరించాలి. వాళ్లే నిజమైన మాన మిస్ ఇండియాలు, మిస్ యూనివర్స్ అని పూరి జగన్నాథ్ చెప్పిమ మాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అల్లు అర్జున్ ఫిదా..
అయితే ఆ మాటలకు అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు. నిజంగా పూరి గారు మీ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. లాగిపెట్టి కొట్టేలా వివరంగా చెబుతున్నారు. పోడ్ కాస్ట్ లో మీరు చెబుతున్న విషయాలు చాలా బాగా నచ్చాయి. ఇలాంటి టాపిక్స్ ఇంకా మరెన్నో చర్చించాలని కోరుకుంటున్నా అని ట్విట్టర్ ద్వారా బన్నీ వివరణ ఇచ్చాడు.
Recommended Video
నీ కోసం మరో పెగ్..
ఇక బన్నీ చేసిన కామెంట్స్ కి పూరి జగన్నాథ్ కూడా ఫుల్ జోష్ లో స్పందించారు. మీ ట్వీట్ కి నిజంగా ఎంతగానో సంతోష పడుతున్నాను. నీ లాంటి సక్సెస్ ఫుల్ యంగ్ స్టర్ నుంచి ఇలాంటి కాంప్లిమెంట్ రావడం హ్యాపీగా ఉంది. నీ కోసం ఈ రాత్రికి మరో పెగ్ ఎక్కువగా వేయాల్సిందే అంటూ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.