ఆలోచనలో పడిన పూరి జగన్నాథ్.. ఇంతవరకూ ఓకే కానీ ఆ తర్వాత!!
'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆలోచనలో పడ్డారు. విజయ్ దేవరకొండతో 'ఫైటర్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన ఆలోచనలో పడినట్లు కొన్ని పిక్స్ షేర్ చేశారు పూరి కనెక్ట్స్ బ్యానర్ వారు. ఇన్ని రోజుల పాటు ముంబైలో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరిపిన పూరి ఈ రోజే (మార్చి 8) ఆ షెడ్యూల్ ఫినిష్ చేశారు.
ఈ మేరకు షూటింగ్ లొకేషన్‌లో పూరి జగన్నాథ్ దీర్ఘాలోచనలో ఉండగా తీసిన ఫోటోలను పూరి కనెక్ట్స్ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ "నెక్స్ట్ షాట్ ఎలా చెయ్యలా అనే డీప్ థాట్స్‌లో పూరి జగన్ #VD10 #PJ37" అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫోటోలలో సీరియస్ గా ఆలోచిస్తూ స్మోక్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు పూరి. 40 రోజులపాటు సాగిన ఈ షెడ్యూల్ లో చిత్రంలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

శ్రీమతి లావణ్య సమర్పణలో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. బాక్సింగ్ సన్నివేశాల్లో రియాలిటీ ఉట్టిపడేందుకు గాను ఆయన శిక్షణ కూడా తీసుకున్నాడు. ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











