విజయ్ తర్వాత సీనియర్ హీరోతో పూరీ జగన్నాథ్: ఫాంటసీ కథతో హిట్ కాంబో రిపీట్

తెలుగులో ఉన్న టాప్ దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. మిగిలిన వారితో పోలిస్తే ఆయనది ప్రత్యేకమైన శైలి. హీరోయిజాన్ని ఎలివేట్ చేసి చూపించడంలో ఈ డైరెక్టర్‌ను కొట్టే వాళ్లే లేరు అన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన సినిమాల్లో నటించేందుకు యంగ్ హీరోలంతా పోటీ పడుతుంటారు. అయితే, ఆ మధ్య చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడాయన. ఈ నేపథ్యంలో 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు.

విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాకు 'లైగర్' అనే టైటిల్ పెట్టారు. తాజాగా సోమవారం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఈ మూవీ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఈ ఏడాది ద్వితియార్ధంలో దీన్ని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు ఓ కథను చెప్పారని, అందులో నటించేందుకు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. 2021 చివర్లో ఈ మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ప్రభాస్ - రాకీ భాయ్: Salaar Movie Pooja & Launch Photos

Puri Jagannadh to Direct Akkineni Nagarjuna after Liger

గతంలో పూరీ జగన్నాథ్.. అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో 'శివమణి', 'సూపర్' వంటి చిత్రాలు వచ్చాయి. దీని తర్వాత వీళ్లిద్దరి కలయికలో మరో సినిమా వస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరి మధ్య చర్చలు జరగడం.. ప్రాజెక్టు ఓకే అవడం జరిగాయని టాక్. ఫాంటసీ కథతో రాబోతున్న ఈ సినిమాను పూరీనే స్వయంగా నిర్మించనున్నారని కూడా అంటున్నారు.

ఇదిలా ఉండగా, అక్కినేని నాగార్జున తాజాగా 'వైల్డ్ డాగ్' అనే సినిమాలో నటించారు. అది త్వరలోనే విడుదల కానుంది. దీని తర్వాత డ్రీమ్ ప్రాజెక్టు 'బంగార్రాజు'లో నటించనున్నారు. ఇది జనవరి చివరి వారంలో ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X