Double iSmart: రామ్ సినిమా నుంచి ఆ సీన్స్ కట్.. పూరీ జగన్నాథ్ షాకిచ్చేది ఎవరికంటే!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో సీక్వెల్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆశించిన రీతిలోనే లభిస్తోంది. ఫలితంగా అదే తరహా సినిమాలు ఇంకాస్త ఎక్కువగా తెచ్చేందుకు దర్శక నిర్మాతలు, హీరోయిన్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఇప్పుడు ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చిన చిత్రమే 'డబుల్ ఇస్మార్ట్'.
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రమే 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' క్రేజీ హిట్‌ను అందుకోవడంతో.. దానికి సీక్వెల్‌గా ఈ సినిమా వచ్చింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని హై రేంజ్‌లో ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీ ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా మొత్తంలో రామ్ పోతినేని 'వన్ మ్యాన్ షో' చేశాడు అని అభిప్రాయాలు వచ్చాయి. అలాగే, రివ్యూలూ పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో మొదటి రోజు అన్ని చోట్లా ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో థియేటర్లు మొత్తం కళకళలాడిపోయాయి.
'డబుల్ ఇస్మార్ట్' మూవీ ఆద్యంతం మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ఫుల్ లెంగ్త్ కమర్షియల్ జోనర్‌లో రూపొందింది. అలాగే, ఇందులో అన్ని వర్గాల వాళ్లకూ నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. అయితే, కమెడియన్ ఆలీ చేసిన కొన్ని సీన్స్ మాత్రం విమర్శలకు తావిచ్చాయి. దీంతో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఈ విషయం దర్శకుడు పూరీ జగన్నాథ్ దృష్టికి కూడా వెళ్లిపోయింది.

క్రేజీ కాంబోలో రూపొందిన 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో ఆలీ 'బొకా' అనే వినూత్నమైన రోల్‌ను చేశాడు. ఇందులో అతడు చేసే సైగలు అభ్యంతకరంగా ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో రెండో రోజు నుంచే పూరీ జగన్నాథ్ ఆ సన్నివేశాలను తొలిగించేసినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ మద్దతు కూడా లభించే ఛాన్స్ ఉంటుంది.
ఇదిలా ఉండగా.. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా, కావ్య థాపర్ హీరోయిన్ చేసింది. అలాగే, అలీ, గెటప్ శ్రీను, షయాజీ షిండే తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











