Ram Pothineni ఇస్మార్ట్ శంకర్ తరహాలో మనిషి మెదడులో వైర్‌లైస్ చిప్.. పూరీ జగన్నాథ్ విజన్‌కు హ్యాట్సాఫ్
సినిమా రంగానికి కావాల్సిన కథలు మన చుట్టూ ఉండే ప్రపంచం నుంచే పుడుతాయి. అలాగే సినిమాను స్పూర్తిగా తీసుకొని కొత్త కొత్త ఆవిష్కరణలు, విధానాలు వెలుగు చూస్తుంటాయి. ఏది ఏమైనా సినిమా రంగం చాలా మందికి స్పూర్తినిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా ప్రపంచ సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణకు ఓ సినిమా విజన్ ఉదాహరణగా నిలిచింది. ఓ దర్శకుడు విజన్‌ను ఏమిటో తాజా ఆవిష్కరణ గుర్తు చేసింది. ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న తాజా ఆవిష్కరణకు హీరో రామ్ పోతినేని నటించిన తెలుగు సినిమా ఇస్మార్ట్ శంకర్ కథ సరిపోయేలా ఉండటంతో సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతున్నది. తాజా ఆవిష్కరణకు, సినిమాకు ఉన్న సంబంధం వివరాల్లోకి వెళితే..
ఇస్మార్ట్ శంకర్ సినిమా విషయానికి వస్తే.. ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్నాలజీ బేస్ చేసుకొని రూపొందింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సిసినిమాలో హీరో రామ్ పోతినేని మెదడులోకి ఓ చిప్ ఇంప్లాంట్ చేస్తారు. ఇలాంటి కథనే నిజ జీవితంలో ట్విట్టర్ యజమాని, టాప్ బిజినెస్ మ్యాన్ ఎలాన్ మస్క్ నిజం చేయడంతో ఇస్మార్ట్ శంకర్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రపంచంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కు సంబంధించిన న్యూరోలింక్ కంపెనీ.. ఇటీవల ఓ మనిషి మెదడులో వైర్‌లెస్ చిప్‌ను అమర్చింది. ప్రయోగం కూడా విజయవంతం కావడంపై హర్షం వ్యక్తమవుతున్నది. మనిషి మెదడులో వైర్‌లెస్ చిప్ అమర్చాం. ఆ చిప్ ద్వారా మనిషిలో జరిగే విషయాలను గుర్తించాం. పేషెంట్ ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంది అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
మెదడులో మైక్రోచిప్ అమర్చడం ద్వారా మనిషిలోని కార్యకలాపాలను నమోదు చేసేందుకు ఉపయోగ పడింది. బ్రెయిన్ యాక్టవిటికి సంబంధించి ఈ చిప్ నుంచి వచ్చే సంకేతాలను బ్లూటూత్ డివైజ్ ద్వారా రికార్డు చేస్తారు.

మనిషి మెదడులో చిప్ అమర్చడం అనే కాన్సెప్ట్‌ను రామ్ పోతినేని హీరోగా చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో దర్శకుడు పూరీ జగన్నాథ్ చక్కగా చూపించారు. ప్రస్తుతం సాంకేతిక ప్రపంచంలో జరిగిన విషయాన్ని ఆయన ముందే పసిగట్టి ఆయన సినిమాకు కథగా వాడుకోవడంపై నెటిజన్లు అభినందిస్తున్నారు. సినిమా కథను ఎలాన్ మస్క్ నిజం చేశారు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI) కోసం మెదడులో చిప్ అమర్చడమనే అసాధారణ ప్రయోగాన్ని సుసాధ్యం చేసిన ఘనత ఎలాన్ మస్క్‌కు దక్కింది.

ఇదిలా ఉంటే.. రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ మూవీ రూపొందుతున్నది. ఈ కథ కూడా ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్నాలజీ మీద ఉంటుంది అనే విషయం ప్రచారంలో ఉంది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఎలాన్ మస్క్ సాధించిన ఘనతతో పూరీ విజన్, ఇస్మార్ట్ శంకర్ గురించి చర్చించుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











