పూరి జగన్నాధ్ కూతురు కూడా సినిమాల్లోకి.. క్లారిటీ ఇచ్చిన ఆకాష్ పూరి!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా సమ్మర్ లో విడుదల కానుంది. అయితే పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆకాష్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో తన పర్సనల్ లైఫ్ గురించి అలాగే పూరి జగన్నాథ్ గురించి కూడా వివరణ ఇచ్చాడు. తన సోదరి పవిత్ర కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

కాన్ఫిడెన్స్ తో ఉన్న ఆకాష్

కాన్ఫిడెన్స్ తో ఉన్న ఆకాష్

ఆకాష్ పూరి మొదట చిరుత అనే సినిమాతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత బుజ్జిగాడు సినిమాలో కూడా చిన్నప్పటి ప్రభాస్ పాత్రలో కనిపించాడు. కొన్ని సంవత్సరాల తరువాత రెగ్యులర్ హీరోగా ఆంధ్ర పోరి అనే సినిమాతో లాంచ్ అయ్యాడు.

అనంతరం మెహబూబా సినిమాను తన తండ్రి దర్శకత్వంలో చేసిన విషయం తెలిసిందే కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఇక ఇప్పుడు సీజీ డైరెక్టర్ అనిల్ దర్శకత్వంలో చేసిన రొమాంటిక్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చాలా కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నాడు.

డైరెక్షన్ కూడా..

డైరెక్షన్ కూడా..

ఇక సినిమాకి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుతూ.. ఆకాష్ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నాడు. భవిష్యత్తులో దర్శకుడిగా కూడా వర్క్ చేసే అవకాశం ఉందని చెబుతూ.. కాకపోతే కథలు డైలాగ్స్ రాయడం నా వల్ల కాదని అన్నాడు. ఇక ఎవరి దగ్గర నుంచి ఏదైనా మంచి కథ దొరికితే తప్పకుండా ఫ్యూచర్ లో మాత్రం ఒక సినిమాను డైరెక్ట్ చేస్తాను. నిజంగా డైరెక్టర్ జాబ్ అనేది అంత ఈజీ కాదు. కానీ మనకు నచ్చితే ఆ వర్క్ చాలా బాగా చేస్తాము.. అని ఆ విషయంలో నా నాన్నగారు చాలా గొప్పగా ఆలోచిస్తారు అని ఆకాష్ తెలియజేశాడు.

మా చెల్లికి ఇంట్రెస్ట్ లేదు

మా చెల్లికి ఇంట్రెస్ట్ లేదు

ఇక పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర పూరి కూడా సినిమాల్లోకి రాబోతున్నట్లు గతంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. బుజ్జిగాడు సినిమాలో పవిత్ర చిన్నప్పటి త్రిష పాత్రలో కనిపించింది. త్వరలోనే ఆమె నటిగా కూడా మళ్లీ వెండితెరపై కనిపిస్తుందనే కథనాలపై కూడా ఆకాష్ వివరణ ఇచ్చాడు. బుజ్జిగాడు టైంలోనే మా చెల్లి పవిత్ర నటించనని చెప్పింది. అప్పటికి కేవలం మా నాన్నగారి ఫోర్స్ వల్లనే నటించింది. కానీ తనకు అస్సలు యాక్టింగ్ పై ఇంట్రెస్ లేదని తెలియజేశాడు.

Recommended Video

Romantic Movie Latest Trailer
నిర్మాతగా చేయాలని..

నిర్మాతగా చేయాలని..

పవిత్ర పూరి నటనపై పెద్దగా ఆసక్తి చూపదనిని కాకపోతే ఆమెకి ప్రొడక్షన్ లోకి రావాలని ఎంతో ఆశగా ఉన్నట్లు ఆకాష్ పూరి వివరణ ఇచ్చాడు. తప్పకుండా మరికొన్ని సంవత్సరాలలో తను నిర్మాతగా కూడా అడుగులు వేసే అవకాశం ఉందని తెలియజేశాడు. ఇక ఇంట్లో మా అమ్మ కారణంగానే చెడు అలవాట్లకు చాలా దూరంగా ఉన్నాను అంటూ ఆ విషయంలో చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా పెంచింది అని ఆకాష్ తెలియజేశాడు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X