మహేశ్ బాబుతో మూవీని రిజెక్ట్ చేసిన రజనీకాంత్.. లీక్ చేసిన డైరెక్టర్

టాలీవుడ్ అగ్రనటులు విక్టరీ వెంకటేష్- సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. తండ్రీ కొడుకులు, అన్నదమ్ముల అనుబంధం, బంధుత్వాల మధ్య ఉండే చిన్న చిన్న వివాదాలే ఇతివృత్తంగా శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా 2013 జనవరి 11న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలై మంచి విజయం సాధించింది. వసూళ్లతో పాటు తెలుగునాట మల్టీస్టారర్ ట్రెండ్‌కు మరోసారి శ్రీకారం చుట్టింది. ఈ సినిమా తర్వాత పలువురు అగ్రనటులు కలిసి సినిమాలు చేసేందుకు ముందుకొచ్చారు.

Also Read
Rao Bahadur Closing Collections: రావు బహదూర్ క్లోజింగ్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీకి లాభమెంత? నష్టమెంత?
Rao Bahadur Closing Collections: రావు బహదూర్ క్లోజింగ్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీకి లాభమెంత? నష్టమెంత?

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో సమంత, అంజలి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో వెంకటేష్, మహేశ్‌లతో సమానమైన పాత్ర ప్రకాష్‌రాజ్‌ది. వీరిద్దరికీ తండ్రిగా, రేలంగి మావయ్యగా అద్భుతంగా నటించారు ప్రకాష్‌రాజ్. మంచి మనిషిగా, ఊరందరికీ ఆత్మీయుడిగా ఉండే ఈ పాత్రలో ఒదిగిపోయారు ఈ విలక్షణ నటుడు. అయితే నిజానికి ఈ రేలంగి మావయ్య పాత్రలో ముందు అనుకున్న నటుడు వేరే ఉన్నారు. ఆయన ఎవరో కాదు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్. తొలుత ఈ పాత్ర కోసం రజనీని సంప్రదించగా ఆయన తిరస్కరించడంతో ప్రకాష్‌రాజ్‌కి దక్కింది. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల స్వయంగా బయటపెట్టారు.

Srikanth Addala Reveals Rajinikanth Was the First Choice for Prakash Raj s Role in Seethamma Vakitlo Sirimalle Chettu

కొద్దినెలల క్రితం శ్రీకాంత్ అడ్డాల ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ప్రేక్షకులకు తెలియని పర్సనల్ సీక్రెట్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోమని యాంకర్ అడగ్గా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో తండ్రి పాత్ర కోసం రజనీకాంత్ గారికి కథ చెప్పాను అది ఎవ్వరికీ తెలియదు. వెంకటేష్, మహేశ్‌లకు తండ్రిగా రజనీకాంత్ గారు చేస్తే బాగుంటుందని అనుకున్నాను. రాఘవేంద్ర కళ్యాణ మంటపం అని చెన్నైలో ఉంటుంది. అక్కడకి రమ్మని పిలిస్తే కళ చెప్పేసి వచ్చేశాను. ఆ సమయంలో రజనీకాంత్ గారికి ఆరోగ్యం బాలేదు. అందుకే చేయను అని చెప్పారు.. కథ మాత్రం బాగా నచ్చింది. తెలుగులో చేయడానికి నాకు అభ్యంతరం కూడా లేదని మంచి మనసుతోనే చెప్పారని శ్రీకాంత్ అడ్డాల అన్నారు.

Recommended For You
10 వేలు ఇస్తా బయటికి గెంటేయండి... బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై జడ్జి ఆగ్రహం
10 వేలు ఇస్తా బయటికి గెంటేయండి... బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై జడ్జి ఆగ్రహం

నేను కథ చెప్పడానికి కూర్చొంటే.. ఆయన చాలా సాదాసీదాగా రావడంతో రజనీకాంత్ అని గుర్తుపట్టలేదు. మంచినీళ్లు తీసుకుంటారా అని అడగ్గా వద్దని చెప్పా. వెనక్కి ముందుకు నడిస్తే కానీ రజనీకాంత్ అని గుర్తుపట్టేలేకపోయా. అంత పెద్ద స్టార్ హీరో నా ముందు ఉండటంతో జీవితంలో మొదటిసారి పులకించిపోయా. 40 నిమిషాలు కథ చెబితే.. ఆయనకు బాగా నచ్చింది. నన్నే ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నావని అడిగారు అని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు.

You May Also Like
ప్రభాస్ నుంచి అదే దోచుకొంటా.. రాధేశ్యామ్ షూటింగ్‌లో డార్లింగ్ అలా.. పూజా హెగ్డే
ప్రభాస్ నుంచి అదే దోచుకొంటా.. రాధేశ్యామ్ షూటింగ్‌లో డార్లింగ్ అలా.. పూజా హెగ్డే

ఈ సినిమాలోని మనిషి అంటేనే మంచోడు.. మంచోళ్లు అయితేనే మనిషి అనిపించుకుంటాడని అని డైలాగ్ చెప్పగలగాలి. రిక్షావాడి నుంచి ఓ కోటీశ్వరుడి వరకు ఆ పాత్రకు కనెక్ట్ అవ్వాలి.. వెంకటేష్, మహేశ్ బాబు వంటి పెద్ద హీరోలతో ప్రయోగం చేస్తున్నప్పుడు రజనీకాంత్‌ను ఎందుకు తీసుకురాకూడదు అనుకున్నాను. దిల్‌రాజు గారిని అడిగాను.. శంకర్ ద్వారా రికమెండ్ చేయించారు, రజనీసర్ రమ్మన్నారు.. చెప్పాను. నాకు హెల్త్ కొంచెం బాలేదు.. బయటికొస్తే రెండు గంటలు కష్టపడాల్సి ఉంటుంది, అందుకే ఈ క్యారెక్టర్ చేయలేకపోతున్నానని చెప్పారు. ఆయన సినిమా చేసినా చేయకపోయినా రజనీకాంత్ గారికి కథ చెప్పాను అన్న సంతృప్తి చాలు అని శ్రీకాంత్ అడ్డాల పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X