ఆ విషయంలో క్షమించండి.. పెద్ది డైరెక్టర్ ఎమోషనల్

టాలీవుడ్‌లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన 'పెద్ది' సినిమా విడుదలపై క్లారిటీ వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ఈ జూన్ 4న విడుదల చేయబోతున్న మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పలు మార్లు రిలీజ్ డేట్స్ మారడంతో ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ నెలకొన్నా, తాజా ప్రకటనతో స్పష్టత వచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

10 ఏళ్లలో ఎన్నో అవమానాలు, అయినా వెనక్కి తగ్గలేదు: శ్రావణ భార్గవి ఎమోషనల్
.
పెద్ది ఈ సినిమా మొదట మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కారణంగా ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఆ తేదీకి కూడా పనులు పూర్తి కాకపోవడంతో మరోసారి రిలీజ్ మారడం అభిమానుల్లో నిరాశ కలిగించింది. మధ్యలో జూన్‌లో మరో తేదీగా 25న విడుదల అవుతుందనే వార్తలు కూడా వినిపించాయి. అదే తేదీకి అఖిల్ అక్కినేని నటిస్తున్న "లెనిన్" సినిమా రావచ్చనే చర్చలతో మరింత కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఇప్పుడు జూన్ 4ను ఫైనల్ రిలీజ్ డేట్ గా ప్రకటించడంతో అన్ని సందేహాలకు క్లారిటీ వచ్చింది.

Ram Charan s Peddi Release Date Confirmed for June 4 Buchi Babu Sana Apologizes

కథ విషయానికి వస్తే, ఇది కమర్షియల్ ఎంటర్టైనర్‌తో పాటు బలమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ కలిగిన చిత్రం అని టీమ్ చెబుతోంది. రామ్ చరణ్ పాత్ర ఈ సినిమాలో కొత్తగా కనిపించనుందని, ఆయన పెర్రెన్స్ హైలైట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, అప్‌డేట్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. నటినటుల విషయానికి వస్తే, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ కనిపించనుండడం కూడా అదనపు హైలైట్‌గా మారింది.

ఇదిలా ఉంటే పెద్ది రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమంలో డైరెక్టర్ బుచ్చిబాబు సనా( Buchi Babu Sana) మాట్లాడుతూ. ముందుగా సుకుమార్ (Sukumar) గారికి ధన్యవాదాలు తెలుపుతూ, "మా ఈవెంట్‌కు వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సర్" అని అన్నారు. 'పెద్ది' సినిమా ఏప్రిల్ 30న రాలేకపోయిందన్నందుకు అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. కానీ ఇప్పుడు జూన్ 4న తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తున్నాం. దయచేసి ఆశీర్వదించండి" అంటూ వినమ్రంగా కోరారు.

సినిమా గురించి మాట్లాడుతూ, "ఇది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అయినా, అందులో స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రతి ప్రేక్షకుడి హృదయానికి దగ్గరయ్యే కథ ఇది. ఒకసారి చూసాక 'పెద్ది' మీ మనసులో నుంచి అంత ఈజీగా పోదు" అని నమ్మకంగా చెప్పారు.

అలాగే.. రామ్ చరణ్ గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ, "చరణ్ సార్‌పై నాకు ఉన్న ప్రేమ, గౌరవం ఈ సినిమాలో మీరు స్పష్టంగా చూస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే'అని అన్నారు. బుచ్చిబాబు మాటల్లో కనిపించిన ఆ భావోద్వేగం, సినిమాపై ఉన్న నమ్మకం ఇప్పుడు ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.

ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా 'పెద్ది'పై తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి, ప్రతి ఫ్రేమ్‌కి ప్రాణం పెట్టి పని చేశానని తెలిపారు. దర్శకుడు బుచ్చిబాబు రాసిన కథ తనను బాగా ఆకట్టుకుందని, ఆ కథకు తాను విజువల్స్ రూపంలో జీవం పోశానని చెప్పారు. అలాగే సుకుమార్ వంటి క్రియేటివ్ మైండ్‌తో పాటు, బుచ్చిబాబు లాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో పని చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ టీమ్ వర్క్ చూస్తే 'రంగస్థలం' రోజులు గుర్తుకు వచ్చాయని, అదే ఎనర్జీ, అదే ప్యాషన్ ఈ ప్రాజెక్ట్‌లో కనిపించిందని వివరించారు. కచ్చితంగా చరణ్ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకోబోతున్నారని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి జూన్ 4న రాబోతున్న 'పెద్ది' ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించబోతున్నారనేది తెలియాల్సి ఉంది.

Read more about: ram charan buchi babu sana peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X