ఫొటోతో సహా రహస్యాన్ని బయటపెట్టిన రామ్ గోపాల్ వర్మ.. సీనియర్ హీరో, డైరెక్టర్ కలిసి!!

ఎలాగోలా వార్తల్లో నిలవడం, సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుడూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం వర్మ నైజం. ఇదే బాటలో తాజాగా టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జునకు సంబంధించిన ఓ ఫోటో షేర్ చేసి మరోసారి వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు రామ్ గోపాల్ వర్మ. మరి ఆ ఫోటోలో ఏముంది? ఫోటో పోస్ట్ చేస్తే వార్తల్లో నిలవడమేంటి? వివరాల్లోకి పోతే..

టైమ్ వస్తే వదలడు.. అది ఎవ్వరైనా సరే!

టైమ్ వస్తే వదలడు.. అది ఎవ్వరైనా సరే!

టైమ్ రావాలే గానీ ఎవ్వరినీ వదలడు వివాదాస్పద వీరుడు రామ్ గోపాల్ వర్మ. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేయడం, ఆ తర్వాత మీ అభిప్రాయం మీ ఇష్టం అనడం ఈయన గారి స్టైల్. ఈ నేపథ్యంలోనే తాజాగా తన శిష్యుడు పూరి జగన్నాథ్‌ని కామెంట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

సర్‌ప్రైజింగ్ ఫోటో షేర్ చేసిన వర్మ

సర్‌ప్రైజింగ్ ఫోటో షేర్ చేసిన వర్మ

తెలుగులో తన ఫస్ట్ మూవీ 'శివ'కు సంబంధించి ఓ సర్‌ప్రైజింగ్ ఫోటో షేర్ చేశారు వర్మ. 1989లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే గాక, తెలుగు సినిమాల్లో మార్పు తీసుకొచ్చింది. అంతేకాదు నాగార్జున కెరీర్‌నీ మలుపుతిప్పింది. శివకు ముందు టాలీవుడ్, శివ తర్వాత టాలీవుడ్ అనే రేంజ్ వర్మ రూపొందించిన 'శివ' సినిమాది.

నాగార్జున వెనకాలే ఆ డైరెక్టర్.. నెటిజన్స్ షాక్

నాగార్జున వెనకాలే ఆ డైరెక్టర్.. నెటిజన్స్ షాక్

ఈ శివ మూవీలోని ఓ స్టిల్ షేర్ చేసిన వర్మ.. ఎవ్వరికీ తెలియని ఓ రహస్యాన్ని బయటపెట్టారు. 'శివ షూటింగులో నాగార్జున, ఇస్మార్ట్ పూరి' అంటూ ఆ స్టిల్ వదిలారు. ఇందులో నాగార్జున వెనకాలే నేటి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఉన్నారు. అస్సలు గుర్తుపట్టని విధంగా ఉన్న ఆయన్ను చూసి నెటిజన్స్ షాకవుతున్నారు.

గుబురు గడ్డం.. సోషల్ మీడియాలో వైరల్

ఈ స్టిల్‌లో చాలా సన్నగా, గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు పూరి జగన్నాథ్. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో ఇంట్రస్టింగ్ విషయమేంటంటే 'శివ' సినిమాలోని 'బోటనీ పాఠముంది... మేటనీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా' అనే సాంగ్ లోనూ చిన్న చిన్న స్టెప్పులేశారు పూరి జగన్నాథ్.

పూరి స్పీడ్.. ఛార్మితో కలిసి

పూరి స్పీడ్.. ఛార్మితో కలిసి

బద్రి సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన పూరి జగన్నాథ్ ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో టాప్ డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు. ''ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి, పోకిరి'' లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ సాధించిన ఆయన ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' రూపంలో భారీ బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. ఛార్మితో కలిసి సినిమాల నిర్మాణంలోనూ భాగమవుతూ ఫామ్‌లో ఉన్నారు పూరి.

Recommended Video

RGV Irritates Pawan Kalyan Fans With His Tweet
ఆ హీరోయిన్‌తో రామ్ గోపాల్ వర్మ ప్రయోగం

ఆ హీరోయిన్‌తో రామ్ గోపాల్ వర్మ ప్రయోగం

మరోవైపు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'ఎంటర్ ది డ్రాగన్' పేరుతో కొత్త సినిమా రూపొందిస్తున్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా భలేకర్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ పూజా భలేకర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ సినిమాపై ఆతృత కలిగించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X