నిధి అగర్వాల్‌తో రామ్ రొమాన్స్.. ఉండిపో అంటూ.. యూట్యూబ్‌‌ని షేక్ చేస్తున్న తాజా వీడియో!

హీరోయిన్ నిధి అగర్వాల్‌తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ రొమాన్స్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. పైగా సోషల్ మీడియాలో ఇది అధికారికంగా విడుదలైన వీడియో. ఇప్పుడు అసలు విషయం అర్థమై ఉంటుంది. అదేనండీ.. రామ్, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి ''ఉండిపో'' ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో నిధి- రామ్ చేసిన రొమాన్స్ చూస్తూ యువత ఎంజాయ్ చేస్తున్నారు.

దీంతో ఈ సాంగ్ నెట్టింట వేగంగా వ్యూస్ రాబడుతూ యూ ట్యూబ్‌‌ని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్, టైటిల్ సాంగ్ విడుదల చేయగా అవి కాస్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రామ్- నిధి రొమాంటిక్ సీన్స్ ఎరగా వేసి నెటిజన్లను తమ వైపుకు తిప్పుకుంది ఇస్మార్ట్ యూనిట్. దాదాపు రెండు నెలల క్రిందట విడుదలైన ఈ సినిమా పాటలు ఇప్పుడు కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం చూసి షాక్ అవుతున్నాయి సినీ వర్గాలు.

Ram Pothineni and Nidhhi Agerwal full romatic video creating sensation in social media

జులై 18వ తేదీన విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి చిత్రయూనిట్‌ని సంబరాల్లో ముంచెత్తింది. మళ్ళీ ఇప్పుడు అదే రేంజ్‌లో వీడియో సాంగ్స్‌కి స్పందన వస్తుండటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తోంది చిత్రయూనిట్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అందించిన జోష్‌లో విజయ్ దేవరకొండతో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు పూరి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. పూరి- విజయ్ దేవరకొండ కలిసి త్వరలోనే సెట్స్ పైకి రానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X