Double Ismart రామ్, ఛార్మీ, పూరీ క్రేజీ ప్రాజెక్ట్.. డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
లైగర్ మూవీ డిజాస్టర్ తర్వాత పూరీ జగన్నాథ్ నుంచి వస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో భారీ విజయం అందుకొన్న ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కనున్నది. ఇస్మార్ శంకర్ సినిమాలో ఉన్న మాస్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌కు డబుల్ డోస్ ఇస్తూ రూపొందించనున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం, పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవ వివరాల్లోకి వెళితే..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇస్మార్ట్ సినిమాను పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విష్ణు రెడ్డి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యులు, కొంతమంది అతిథుల సమక్షంలో డబుల్ ఇస్మార్ట్ ప్రారంభ వేడుక జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవంలో భాగంగా సినీ నటి, నిర్మాత ఛార్మి క్లాప్ కొట్టగా, హీరో రామ్‌పై తొలి సన్నివేశానికి పూరీ జగన్నాథ్ స్వయంగా దర్శకత్వం వహించారు. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ అనే డైలాగ్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

డబుల్ ఇస్మార్ట్ సినిమాను గ్రాండ్‌గా లాంఛ్ చేసిన సందర్భంగా హీరో రామ్ పోతినేని ట్విట్టర్‌లో ఓ ఫోటోలను షేర్ చేశారు. డబుల్ ది ఎంటర్‌టైన్‌మెంట్! డబుల్ ది యాక్షన్! డబల్ ది మ్యాడ్‌నెస్! వీ ఆర్ బ్యాక్ !! డబుల్ ఇస్మార్ట్ మోడ్ ఆన్! " అంటూ ట్విట్టర్‌లో రామ్ షేర్ చేశారు. డబుల్ ఇస్మార్ట్ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నదని చిత్ర యూనిట్ వెల్లడించింది.
హీరో రామ్, దర్శకుడు పూరీ జగన్నాథ్ కెరీర్‌లో ఇస్మార్ట్ శంకర్ చిత్రం ప్రత్యేకమైనది. ఈ ఇద్దరికి బ్లాక్‌బస్టర్ చిత్రంగా రికార్డు కలెక్షన్లను సాధించింది. దాంతో డబుల్ ఇస్మార్ట్ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇస్మార్ట్ శంకర్ మూవీ కంటే భారీ అంచనాలు ప్రారంభ వేడుకతోనే ఏర్పడ్డాయి.
హీరో రామ్ పోతినేని క్రేజ్, తనపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను బేరిజు వేసుకొని పూరీ జగన్నాథ్ కథ రాశారు. భారీ బడ్జెట్‌తోపాటు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సినిమాను తెరకెక్కించనున్నాం. ఇస్మార్ శంకర్ మూవీలో చూసిన దానికంటే డబుల్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి అని చిత్ర యూనిట్ వెల్లడించింది. డబుల్ ఇస్మార్ట్ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి ప్యాన్ ఇండియా మూవీగా విడుదల కానున్నది.


Click it and Unblock the Notifications











