ముంబైలో జెనీలియాతో హీరో రామ్.. పక్కనే ఆమె భర్త.. ఇదీ విషయం
Recommended Video
సినీ ఇండస్ట్రీలో కొన్ని జోడీలు ఎప్పటికీ ప్రత్యేకం. ఆ జోడీ కలిసి నటించింది ఎన్ని సినిమాలు అనే సంగతి పక్కన బెడితే.. ప్రేక్షకులకు మరపురాని అభినయం చూపించి వారి మదిలో గూడు కట్టుకుంటాయి కొన్ని వెండితెర జంటలు. అలాంటి జంటల్లో ఒకటే ఎనర్జిటిక్ స్టార్ రామ్- జెనీలియా జంట. 'రెడీ' సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ జంట రియల్ లైఫ్‌లో కూడా మంచి స్నేహితులు. అందుకే రామ్ ప్రత్యేకంగా ముంబై వెళ్లి జెనీలియాను కలిశాడు. అయితే వీరిద్దరూ కలిసిన సందర్భం ఏమిటి అనే విషయానికొస్తే..

హ.. హ.. హాసినికి ప్రత్యేకం
హ.. హ.. హాసిని అంటూ చిలిపి పనులతో బొమ్మరిల్లు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది హీరోయిన్ జెనీలియా. ఆగస్టు 5 వ తేదీ ఈమెకు ప్రత్యేకమైన రోజు. అదేనండీ ఆమె పుట్టిన రోజు. ఈ ఏడాది ఆగస్టు 5న ఆమె తన 32 వ పుట్టిన రోజు వేడుకను జరుపుకుంది. ఈ వేడుకకు ప్రత్యేకమైన అతిథి కూడా హాజరయ్యాడు. ఆయనే హీరో రామ్.
జెనీలియా కోసం ముంబై వెళ్లిన రామ్
జెనీలియా పుట్టిన రోజు సందర్బంగా ముంబై వెళ్లిన హీరో రామ్.. జెనీలియా, ఆమె భర్త రితేష్ దేశముఖ్‌తో కలిసి బర్త్ డే పార్టీ ఎంజాయ్ చేశాడు. ఈ మేరకు ఆ రియల్ లైఫ్ జంటతో కలిసి దిగిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన హీరో రామ్ ''మై స్వీటెస్ట్, క్యుటెస్ట్, బెస్టెస్ట్ జెనీలియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నీకు ఈ సంవత్సరం బాగా కలిసి రావాలి'' అని ట్యాగ్ చేశాడు. చాలా రోజుల తరువాత జెనీలియాకు, రామ్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూసిన ప్రేక్షకులు ఆమెకు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పిక్ వైరల్ చేసేశారు.

అప్పట్లో జెనీలియా, రామ్
జెనీలియా, రామ్ స్నేహం ఇప్పటిది కాదు. 2008లో వచ్చిన 'రెడీ' సినిమాలో నటించిన ఈ ఇద్దరూ ఆ తర్వాత బాగా దగ్గరయ్యారు. అప్పట్లో రెడీ మూవీ భారీ విజయం సాధించడంతో ఈ జోడీకి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. 2012లో జెనీలియా బాలీవుడ్ నటుడు రితేష్‌ని పెళ్లి చేసుకున్న జెనీలియా.. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది.

ఇస్మార్ట్‌గా రామ్
మరోవైపు హీరో రామ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ రూపంలో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హై వోల్టేజ్ ఎనర్జిటిక్ పర్‌ఫార్‌మెన్స్ చూపించి ఆకట్టుకున్నాడు రామ్. ఆయన కెరీర్‌లో ఇస్మార్ట్ శంకర్ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











