పూరి జగన్నాథ్‌ని సర్‌ప్రైజ్ చేసిన రామ్.. అదిరిపోయే గిఫ్ట్

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలయికలో వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ముదులిపింది 'ఇస్మార్ట్ శంకర్' సినిమా. కెరీర్‌లో సరిగ్గా హిట్ అవసరమైన సమయంలో ఈ ఇద్దరికీ మంచి బ్రేక్ ఇచ్చిందీ సినిమా. దీంతో రామ్, పూరి జగన్నాథ్ సహా చిత్రయూనిట్ అంతా ఈ సినిమా విజయాన్ని ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుండటం విశేషం.

ఈ నేపథ్యంలో ఇటీవలే జరిగిన పూరి జగన్నాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అదిరిపోయే గోల్డ్ ఫాంట‌మ్ అనే వైర్‌లెస్ స్పీక‌ర్స్‌ గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు హీరో రామ్. ఇందులో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' మాస్ మసాలా బీట్స్ వింటూ ఎంజాయ్ చేశారు పూరి. ఈ సందర్బంగా రామ్‌కి థాంక్స్ చెప్పారు. ఇక సెప్టెంబర్ 28న జరిగిన తన పుట్టిన రోజున 20 మంది కొత్త డైరెక్టర్లకు సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు పూరి జగన్నాథ్.

Ram Pothineni Gave A Gift To Puri Jagannadh

ప్రస్తుతం పూరి జ‌గ‌న్నాథ్ త‌న కొడుకు ఆకాశ్ పూరితో 'రొమాంటిక్‌' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రోజే (సోమవారం) విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ యూత్ ఆడియన్స్‌కి స్పెషల్ కిక్ ఇచ్చింది. అలాగే తన తదుపరి సినిమాను విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేయ‌డానికి రెడీ అవుతున్నారు పూరి జగన్నాథ్. ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్న పూరి.. ఇందుకోసం గోవా వెళ్ళబోతున్నారని సమాచారం.

ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా విషయానికొస్తే.. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కింది ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాలో రామ్ ఎనర్జిటిక్ పర్‌ఫార్‌మెన్స్‌.. నభా నటేష్, నిధి అగర్వాల్ అందాల విందులు చూసి ఫిదా అయ్యారు టాలీవుడ్ ఆడియన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X