మరోసారి ‘ఇస్మార్ట్’ కాంబినేషన్: ఆ మూవీని రీమేక్ చేయబోతున్న రామ్ - పూరీ జగన్నాథ్

వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌.. దాదాపుగా అదే పరిస్థితిని ఎదుర్కొంటోన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని ఒకేసారి హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. హిట్ టాక్‌ మాత్రమే కాదు.. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసిందీ చిత్రం. మొత్తంగా రూ. 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత పూరీతో అతడు మరోసారి జత కట్టబోతున్నాడని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కలయికలో మరో సినిమా రాబోతుందట. బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని ఈ జోడీ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, అది ఇప్పుడు కాదని అంటున్నారు. 2022 ప్రారంభంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, దీన్ని బాలీవుడ్ నిర్మాతతో కలిసి పూరీ జగన్నాథ్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కాంబో మరోసారి హైలైట్ అవుతోంది.

 Ram Pothineni Puri Jagannadh Team Up for Bollywood Remake

ఇక, ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. కరణ్ జోహార్, పూరీ, చార్మీలు కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్. ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. మరోవైపు, తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక.. కొత్త ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం ఉందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X