ఛార్మితో రామ్‌కి చెడిందా..? హీరో రిప్లై చూడండి ఎలా ఉందో!

చాలా కాలం తర్వాత ఎనర్జిటిక్ రామ్ తన కెరీర్‌లో హిట్ సాధించాడు. ఇస్మార్ట్ శంకర్ రూపంలో వచ్చిన హిట్ ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా దూసుకుపోతోంది. అంతేకాదు రామ్ కెరీర్‌ని మలుపుతిప్పే సినిమా ఇదేనని అంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమా ఇచ్చిన కిక్ ఆయన్ను టాప్ రేంజ్ కి తీసుకెళ్తుందని చెప్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇస్మార్ట్ శంకర్ విషయంలో ఛార్మి, పూరి జగన్నాథ్ లతో రామ్‌కి బేధాభిప్రాయాలు వచ్చాయని వస్తున్న వార్తలు ఆయన అభిమానులకు కాస్త ఇబ్బంది కలిగించాయి.

ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆశించిన స్థాయిని మించి సక్సెస్ అయినా కూడా సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొనకుండా ఈ పరిస్థితుల్లో ఆయన విదేశాలకు వెళ్ళడానికి కారణం దర్శకనిర్మాతలతో గొడవే అని ఆ వార్తల సారాంశం. అంతేకాదు హీరో రామ్‌ మొదట చెప్పిన రెమ్మ్యూనరేషన్ ఇవ్వకుండా అందులో సగం మాత్రమే ఇచ్చారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పూరి, ఛార్మిలతో రామ్ గొడవపై సినీ లోకంలో చర్చలు మొదలయ్యాయి. దీంతో ఈ విషయమై తాజాగా ఓ ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చాడు రామ్.

 Ram Pothineni Responce On Rumors

దర్శకనిర్మాతలతో గొడవ అని వస్తున్న వార్తలు చూసి పడిపడి నవ్వుకున్నా. అందులో నిజం లేదు.. సాధారణంగా ఇలాంటి తప్పుడు వార్తలకు నేను స్పందించను కానీ.. ఈ గాసిప్ మాత్రం సూపర్‌ అనిపించింది. 'బంగారం అండీ ఇలాంటోళ్ళు' అని పేర్కొన్నాడు రామ్. ఈ ట్వీట్‌ని పూరీ, ఛార్మి లకు కూడా ట్యాగ్‌ చేశారు. దీంతో ఇప్పటివరకు వచ్చిన రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడినట్లయింది.

మరోవైపు ఇస్మార్ట్ శంకర్ సినిమా 50 కోట్ల క్లబ్‌కి చేరువయ్యింది. పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా సమర్పించిన ఈ సినిమాలో రామ్ హీరోగా నటించగా.. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. రామ్ గోపాల్ వర్మ లాంటి బడా డైరెక్టర్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X