మరోసారి రామ్ పవర్‌ఫుల్ పాత్రలో.. ఎనర్జిటిక్ స్టార్ RED షూటింగ్ స్టార్ట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్‌లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు అదే జోష్‌తో, అంతకు రెట్టింపు పవర్‌తో తన కొత్త సినిమా RED సెట్స్ పైకి వచ్చేశాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్.

ఈ రోజు (అక్టోబర్ 30) హైదరాబాద్‌లో RED సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి పూరి జగన్నాథ్, ఛార్మి విచ్చేసి రామ్‌కి ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు. మొదటి షాట్ కోసం జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా క్లాప్ కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Ram Pothinenis RED movie Starts Officially

ఈ సినిమాను తన హోం బ్యానర్ స్రవంతి మూవీస్‌ పతాకంపై తెరకెక్కించనున్నారు రామ్. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్‌ జోడిగా నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మలను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందించనున్నారు.

రామ్ కెరీర్‌లో 18వ సినిమాగా రాబోతున్న RED (రెడ్) సినిమాలో రామ్ రోల్ చాలా డిఫెరెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకలోకంలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ పోస్టర్స్‌లో రామ్ మాస్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు ఆయన ఫ్యాన్స్. భారీ హైప్ నడుమ ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత వెండితెరపై రామ్ చెడుగుడు చూడాలని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X