గుండు కొట్టించుకున్న రామ్.. షాకింగ్ లుక్.. నెట్టింట వైరల్ పిక్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని భయంకరమైన లుక్‌లో దర్శనమిచ్చి షాకిచ్చాడు. గుండు కొట్టించుకొని తన గత లుక్‌కి ఏ మాత్రం సంబంధం లేని విధంగా కనిపించాడు. ఈ లుక్‌ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న రామ్..''మిడ్లీ వైల్డ్'' అంటూ ట్యాగ్ చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలయ్యాక కొన్ని రోజులు విదేశాలకు వెళ్లిన రామ్ సడెన్ గా ఈ లుక్‌లో దర్శనమివ్వడంతో షాకవుతున్నారు ప్రేక్షకులు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో గుబురు గడ్డం, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌, తలలో స్మార్టుకార్డుతో దర్శనమిచ్చిన రామ్.. మాస్ మసాలా డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత మరో సినిమాకు కమిట్ అవ్వని రామ్ సడెన్‌గా ఇలా గుండు గెటప్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఈ లుక్‌కి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా గుండు, ఫ్రెంచ్ గడ్డంతో కొత్త లుక్‌లో అభిమానులను ఆకట్టుకున్నాడు హీరో రామ్.

Ram Pothinenis Shocking Look Viaral On social Media

ఇక రామ్ లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమా విషయానికొస్తే.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. చిత్రంలో రామ్ సరసన నటించిన నభా నటేష్, నిధి అగర్వాల్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్నారు. ఈ సినిమా ఇప్పటివరకు 75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. ఇస్మార్ట్ శంకర్ సాధించిన విజయం పట్ల ఖుషీగా ఉన్న చిత్రయూనిట్ పలు పార్టీలు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X