Double ISMART: ఛార్మీతో కలిసి గుడ్ న్యూస్ చెప్పిన రామ్.. మరీ ఇంత స్పీడా!
వరుస పరాజయాలతో సతమతం అయిన ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను ఒకేసారి హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించాలని పూరీ ఎప్పుడో డిసైడ్ అయ్యాడు.
రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబోలో క్రేజీ హిట్ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమే 'డబుల్ ఇస్మార్ట్'. ఇస్మార్ట్ శంకర్ బ్రెయిన్‌లోని చిప్ పని చేయడం మొదలైన తర్వాత అతడిలో వచ్చిన మార్పుల నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇటీవలే ఉస్తాద్ రామ్ - పూరీ జగన్నాథ్ కాంబోలో 'డబుల్ ఇస్మార్ట్' రాబోతుందని అధికారిక ప్రకటన వెలువడింది. అంతేకాదు, దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ముంబైలో ప్రారంభం అయింది. దీన్ని దాదాపు పది రోజులకు పైగానే షూట్ చేశారు. ఇందులో హీరో రామ్‌తో పాటు కీలక పాత్రను చేస్తున్న పలువురు నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.
రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీ ఫస్ట్ షెడ్యూల్ తాజాగా కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇందులో ముంబైలో యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు తెలిపింది. అలాగే, త్వరలోనే విదేశాల్లో క్రేజీ షెడ్యూల్‌ను జరపబోతున్నట్లు కూడా పేర్కొంది. ఈ మేరకు రామ్, ఛార్మీ కలిసి ఉన్న ఓ పిక్‌ను కూడా చిత్ర యూనిట్ షేర్ చేసింది.
ఇక.. 'డబుల్ ఇస్మార్ట్' మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇందులో నటించే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











