పూరీ మార్క్‌తో డబుల్ ఇస్మార్ట్ టీజర్.. సర్‌ప్రైజ్ చేసిన రామ్ పోతినేని

టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. ఈ మధ్య కాలంలో తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న అతడు.. ప్రతి సినిమాకూ రేంజ్‌ను పెంచుకునేలా ముందుకు సాగుతోన్నాడు. అయితే, కొంత కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఈ సారి హిట్ కొట్టాలని 'డబుల్ ఇస్మార్ట్' మూవీ చేస్తున్నాడు.

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపకల్పనలో రామ్ పోతినేని నటిస్తోన్న చిత్రమే 'డబుల్ ఇస్మార్ట్'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సూపర్ హిట్ అయిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీకి ఇది సీక్వెల్‌గా రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందిస్తున్నారు.

Ram Pothineni Starrer Double ISMART Movie Teaser Released

'డబుల్ ఇస్మార్ట్' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అంతేకాదు, చిత్రీకరణ కూడా శరవేగంగానే సాగుతోంది. ఇందులో హీరో రామ్‌తో పాటు కీలక పాత్రను చేస్తున్న పలువురు నటీనటులపై షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా పలు షెడ్యూళ్లను ప్లాన్ చేసి వీలైనంత త్వరగా దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు.

Ram Pothineni Starrer Double ISMART Movie Teaser Released

డిఫరెంట్ యాక్షన్‌తో రాబోతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీ నుంచి ఇప్పటి వరకూ పెద్దగా అప్‌డేట్లు రాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్‌పై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు చూపించారు. ముఖ్యంగా ఈ టీజర్‌లో అన్నింటిపై పూరీ జగన్నాథ్ మార్క్ స్పష్టంగా కనిపించింది.

తాజాగా విడుదలైన 'డబుల్ ఇస్మార్ట్' టీజర్‌లో రామ్ వన్ మ్యాన్ షో కనిపించింది. అలాగే, ఇందులో మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ చాలా బాగున్నాయి. డైలాగులు ఎప్పటిలాగే పేలిపోయేలా రాశారు. రామ్ లుక్ కూడా తగినట్లుగానే ఉంది. సంజయ్ దత్ పాత్రను కూడా బాగా ఎలివేట్ చేశారు. మొత్తంగా ఈ టీజర్ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్లతో ఆకట్టుకునేలానే ఉంది.

ఇదిలా ఉండగా.. 'డబుల్ ఇస్మార్ట్' మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ కీలకమైన పాత్రను చేస్తున్నాడు. అలాగే, కావ్య థాపర్ హీరోయిన్ నటిస్తోంది. ఇందులో అలీ, గెటప్ శ్రీను, షయాజీ షిండే తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X