దిమాక్ ఖరాబ్ చేయనీకి వచ్చేశినా.. ఇగ షురూ చేయండ్రి: హీరో రామ్
మీ అందరి దిమాక్ ఖరాబ్ చేయనీకి వచ్చేశినా అంటూ ఓ కొత్త అప్‌డేట్ పట్టుకొచ్చి ప్రేక్షకులకు స్పెషల్ ఎనర్జీ ఇచ్చాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఆయన హీరోగా రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కొత్త అప్‌డేట్ ద్వారా కిక్ ఇచ్చాడు. అరె! ఇస్మార్ట్ శంకర్ అప్‌డేట్ ఇప్పుడేంటబ్బా.. అనుకుంటున్నారు కదూ. అదేనండీ.. ఇస్మార్ట్ శంకర్‌లో ప్రేక్షకులకు గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉర్రూతలూగించిన పాట.. ''చిలక చికల చిలక'' ఫుల్ సాంగ్ యూ ట్యూబ్‌లో విడుడల చేశారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన హీరో రామ్..''మీ అందరి దిమాక్ ఖరాబ్ చేయనీకి వచ్చేశినా.. ఇగ షురూ చేయండ్రి..'' అని ట్యాగ్ చేస్తూ ఆ సాంగ్ వీడియోను పోస్ట్ చేశాడు. విడుదల చేసిన కొద్ది సేపట్లోనే ఈ సాంగ్ యూ ట్యూబ్ సెన్సేషన్‌గా మారింది. ఫాస్ట్ బీట్‌లో హీరో రామ్ చిందుకు, హీరోయిన్స్ నభా నటేష్, నిధి అగర్వాల్ అందాలు చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ''డబుల్ దిమాక్'' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ సహా నటీనటులందరికీ ఈ సినిమా ఘనవిజయం అందించి నిర్మాతలకు లాభాల పంట పండించింది.


Click it and Unblock the Notifications











