విజయదశమికి ప్రభాస్ నుంచి అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్
'డార్లింగ్' ప్రభాస్ ప్రస్తుతం తన పెదనాన్న కృష్ణంరాజు మరణంతో షాక్ లో ఉన్నారు. ఆ భాద నుంచి బయటపడాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. తనను ఇంతగా ప్రేమించేవారికోసం ప్రభాస్ ఒక స్పెషల్ గిఫ్ట్‌ను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఆదిపురుష్' టీం ఇప్పటివరకు కనీసం ఫస్ట్ లుక్, పోస్టర్ కూడా విడుదల చేయలేదు. దీనికోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అదే టీం నుంచి టీజర్ బయటకు రాబోతోంది.

ఇంతవరకు ఎవరూ తెరపై చూడని విధంగా..
షూటింగ్ తోపాటు గ్రాఫిక్ వర్క్ కూడా పూర్తిచేసుకొని ప్రచారంపై ఇప్పుడు దృష్టిపెట్టబోతోంది. పండగకు రెండురోజులు ముందుగా భారీ ఎత్తున టీజర్ లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు భారతీయ తెరపై చూడని విజువల్ ఎఫెక్ట్స్ 'ఆదిపురుష్' లో ఉన్నాయని పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తోంది.టీజర్ అభిమానుల అంచనాలను అందుకునేలా దర్శకుడు ఓంరౌత్ దగ్గరుండి ఎడిట్ చేస్తున్నారు.

2023 సంక్రాంతికి విడుదల?
2023 జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయాలని యోచిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన గత చిత్రం 'తానాజీ' కూడా 2020 జనవరి 12న విడుదలైన ఘనవిజయం సాధించింది. ఇప్పుడు సెంటిమెంట్ గా అదే తేదీన 'ఆదిపురుష్ రాబోతోంది'. సంక్రాంతి పండగ అనేది సినిమాలకు పెద్ద మార్కెట్. సీజన్ పరంగా టాలీవుడ్ కు బాగా కలిసొస్తుంది. ఆ సమయానికి తెలుగులో 'వాల్తేర్ వీరయ్య' ఒక్కటే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకే సినిమాలు లేవు. ఆదిపురుష్ లో సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సీతగా కృతిసనన్ నటించారు. దీన్ని పూర్తిగా త్రీడీలో నిర్మించారు.

రూ.1500 కోట్లు వసూలు చేస్తుందని అంచనా?
ఇటీవలే విడుదలైన 'బ్రహ్మస్త్ర' చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చాయి. దీంతో కాసుల వర్షం కురిపించారు. ఆ ఎఫెక్ట్స్ కే అలా ఉంటే.. 'ఆదిపురుష్'లో మైండ్ బ్లోయింగ్ తరహాలో శ్రీరాముడి కథను చూపించారని, దానికి దాదాపు ఒక్క భారతదేశంలోనే 1500 కోట్లరూపాయల కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. పాన్ ఇండియాగా రాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్‌పై అభిమానులే కాకుండా పరిశ్రమ వర్గాల అంచనాలు భారీగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











