అకిరా నందన్ ఫేవరేట్ టాలీవుడ్ హీరో అతనే.. మెగా హీరో కాదట!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్నది అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కోసమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా ఇప్పటికే తన హైట్ తో తెలియకుండానే స్పెషల్ బజ్ క్రియేట్ చేశాడు. ఇక అతను వీలైనంత త్వరగా వెండితెరపై కనిపిస్తే అద్భుతంగా ఉంటుందని పవర్ స్టార్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇక ఇటీవల రేణు దేశాయ్ అకిరా ఫేవరేట్ హీరో ఎవరనే విషయాన్ని చెప్పారు.

లవ్ కాంప్లికేటేడ్.. బ్రేకప్ చాలా దారుణం.. ఆ బాధ నుంచి ఎలా బయటపడ్డానంటే.. రేణుదేశాయ్

 అకిరా ఎంట్రీ ఎప్పుడు?

అకిరా ఎంట్రీ ఎప్పుడు?

16 ఏళ్ళ వయసులోనే అకిరా నందన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. 6.4 హైట్ ఉండడంతో సినీ దర్శకులు కూడా అతన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అకిరా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అతను సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే రేణు దేశాయ్ మాత్రం చాలా వరకు ఆ విషయంపై పెద్దగా క్లారిటీ ఇవ్వడం లేదు. అకిరా ప్రస్తుతం తన స్టడీస్ గురించి ఆలోచిస్తున్నాడు అని తెలిపింది.

 అతనికి ఇష్టం లేదు

అతనికి ఇష్టం లేదు

సాధారణంగా హీరో కుమారులు చాలా వరకు హీరోలే అవ్వాలని కోరుకుంటారు. కానీ అకిరాకు మాత్రం ఇప్పుడైతే హీరో అవ్వాలనే కోరిక లేదని రేణు దేశాయ్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఆ విషయం అభిమానుల్లో కొంత ఆందోళనను కలిగించింది. తప్పకుండా పవన్ వారసుడు సినిమాల్లోకి రావాల్సిందే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కానీ అకిరా కెరీర్ కోసం ఏం చేసినా అతని ఇష్టమని రేణు తెలిపారు.

అకిరా ఫేవరేట్ హీరో..

అకిరా ఫేవరేట్ హీరో..

అకిరా నందన్ కి ఇష్టమైన హీరో గురించి కూడా రేణు దేశాయ్ తెలిపారు. ఎవరు సినిమా చూసిన తరువాత అకిరా.. అడివి శేష్ ని అమితంగా ఇష్టపడటం మొదలుపెట్టడాని అతనే అకిరా ఫెవరేట్ హీరో అని చెప్పారు. అదే విధంగా అడివి శేష్ ని అకిరా.. అన్న అని పిలుస్తాడాని ఇద్దరు చాలా విషయాల గురించి మాట్లాడుకుంటారని రేణు దేశాయ్ తెలిపారు.

Recommended Video

#Tollywood : This Famous Director Lost A Chance To Direct The Pawan Kalyan Movie | Filmibeat Telugu
అడివి శేష్ ఫ్యామిలీ ఫ్రెండ్..

అడివి శేష్ ఫ్యామిలీ ఫ్రెండ్..

ఎవరు సినిమా అనంతరం అకిరా అడివి శేష్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. అప్పటి నుంచి అతను ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాడని, తనకు ఇష్టమైన హీరోనే అన్నయ్య అనుకుంటూ అకిరా అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని రేణు దేశాయ్ వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం అకిరా మ్యూజిక్ పై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు చెబుతూ.. యాక్టింగ్ గురించి అయితే ఆలోచించడం లేదని అన్నారు. మరి జూనియర్ పవర్ స్టార్ వెండితెరపైకి వస్తాడో లేదో తెలియాలి అంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X