లైగర్ సినిమాపై RGV రివ్యూ: మహేష్ , పవన్ కళ్యాణ్ పేర్లను లాగుతూ షాకింగ్ కామెంట్స్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి కామెంట్ చేసినా కూడా విబిన్నంగా ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లాజిక్స్ తో కాంట్రవర్సీ క్రియేట్ చేయడమే కాకుండా టాలెంట్ ఉన్న వారిని కూడా తన మంచి తనంతో సపోర్ట్ చేస్తుంటాడు. ఇక మాస్ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లైగర్ సినిమాను అందరికంటే ముందే కాస్త రుచి చూసిన ఆర్జీవి ఎవరు ఊహించని రివ్యూ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్, మహేష్ లాంటి అగ్ర నటీనటుల పేర్లను కూడా మధ్యలోకి లాగాడు.

Recommended Video

RGV ట్వీట్ల పరంపర, Allu Sirish పై సెటైర్, Anandayya కి Nobel ఇవ్వాలంటూ || Filmibeat Telugu
పూరి జగన్నాథ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ

పూరి జగన్నాథ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొదటిసారి లైగర్ తో పాన్ ఇండియా ప్రపంచానికి పరిచయం కాబోతున్నాడు. విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఎలాగైనా సినిమాతో సక్సెస్ అందుకోవాలని చాలానే కష్టపడుతున్నారు.

లైగర్ సీన్స్ చూసిన RGV

లైగర్ సీన్స్ చూసిన RGV

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే పూరి జగన్నాథ్ గురువు రామ్ గోపాల్ వర్మ మొదటిసారి లైగర్ సినిమాపై స్పందించాడు. చూసింది కొన్ని సన్నివేశాలే అయినా తనదైన శైలిలో రివ్యూ ఇచ్చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, టైగర్ ష్రాఫ్ వంటి హీరోల పేర్లను కూడా లాగాడు.

వాళ్ళకంటే సూపర్ క్రాస్

వాళ్ళకంటే సూపర్ క్రాస్

కరణ్ జోహార్ సమర్పణలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లైగర్' సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూశాను. పులి, సింహం కంటే కూడా విజయ్ దేవరకొండ క్రాస్ గా ఉన్నాడు అంటూ.. పవన్ కళ్యాణ్, మహేష్, రవితేజ, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్స్ కంటే కూడా విజయ్ సూపర్ క్రాస్ అని వర్మ వివరణ ఇచ్చారు.

వర్మ ట్వీట్ వైరల్

వర్మ ట్వీట్ వైరల్

వర్మ చేసిన ట్వీట్ తో సినిమాపై అంచనాలు డోస్ మరింత పెరిగాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ గోపాల్ వర్మ పూరి జగన్నాథ్ సినిమాపై చిన్నపాటి రివ్యూ ఇవ్వడం వైరల్ గా మారింది. ఇక సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రౌడి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

రిలీజ్ ఎప్పుడంటే?

రిలీజ్ ఎప్పుడంటే?

ఇక సినిమా విడుదలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సగానికి పైగా షూటింగ్ అయితే అయిపోయింది. మిగిలిన 30% మెయిన్ సీన్స్ కోసం కోసం వేలాది మందితో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుందట. దర్శకుడు పూరి తలచుకుంటే ఆ సీన్స్ ను పూర్తి చేయడానికి పెద్దగా సమయం పట్టదు. ఇక సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరి పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X