టాలెంట్ ఉంటే ఎదగడం సాధ్యమే: పూరిపై వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాధ్ ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా రామ్ గోపాల్ వర్మ వద్ద పని చేసిన సంగతి తెలిసిందే. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన కొన్ని చిత్రాల్లో పూరి చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు.
శివ చిత్రంలో ఓ పాటలో జూనియర్ ఆర్టిస్టుగా నటించిన పూరి వీడియోను తాజాగా వర్మ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఆ వీడియోను చాలా మంది చూసే ఉంటారు... కానీ వర్మ చెప్పే వరకు అందులో నీలంరంగు షర్టు వేసుకున్న వ్యక్తి పూరి జగన్నాధ్ అనే విషయం తెలియదు.

'ఈ వీడియోలో కనిపిస్తున్న బ్లూషర్ట్ జూనియర్ ఆర్టిస్ట్ నేటి తరం సూపర్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.... హే పూరి వాట్ ఎ జర్నీ' అంటూ ఆయన ఈ వీడియో షేర్ చేయగా... 'అవును సార్' అంటూ పూరి రిప్లై ఇచ్చారు. ఇప్పటికీ కొందరు అభిమానులు ఆ వీడియోలో ఉన్నది పూరి జగన్నాధ్ అంటే నమ్మలేక పోతున్నారు.
నువ్వు ఎంతో మందికి ఆదర్శనం. టాలెంట్ ఉంటే ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నా ఉన్నత స్థానాలను అందుకోగలడు అని నిరూపించిన వ్యక్తివి నువ్వు.... అంటూ వర్మ వ్యాఖ్యానించారు. వర్మ చేసిన ఈ ట్వీట్ మీద అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. కొందరు వీరి ప్లాపు సినిమాలను గుర్తు చేస్తూ నెగెటివ్ కామెంట్లు చేస్తే... మరికొందరు పాజిటివ్‌గా స్పందించారు.


Click it and Unblock the Notifications











