Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
హీరోయిన్‌తో బీచ్ ఒడ్డున రొమాన్స్.. సెక్సీ యాంగిల్! కిక్కెస్తున్న పూరి జగన్నాథ్
తెలుగు తెరపై కేవలం హీరోయిన్ అందాలతో మ్యాజిక్ చేయొచ్చు అని నిరూపించింది ఎవరంటే అది ఖచ్చితంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాత్రమే. వచ్చి రావడమే ఆయన మార్క్ ఉండేలా హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ పండించారు పూరి. అలా అలా పూరి స్టైల్ రొమాన్స్ అంటే యువత పడిచచ్చే స్టేజీ వచ్చేసింది. ఎన్నో సినిమాల్లో, ఎందరో హీరోయిన్లతో రొమాన్స్ చేయించిన ఆయన తాజాగా తన కొత్త సినిమా ఇస్మార్ట్ శంకర్ లోనూ ఏ మాత్రం తగ్గటం లేదు.
ఇద్దరు యంగ్ భామలు నడుమ ఛార్మి
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఏకంగా ఇద్దరు యంగ్ అండ్ హాట్ హీరోయిన్స్ ని తన మార్క్ రొమాంటిక్ సీన్స్ కోసం తీసుకున్నారు పూరి జగన్నాథ్. అందులో ఒకరు నిధి అగర్వాల్ కాగా.. మరొకరు నభా నటేష్. ఈ ఇద్దరూ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిన అప్ కమింగ్ హీరోయిన్స్ కావడంతో వారిని బాగా వాడేసినట్టున్నారు పూరి. ఛార్మి సహకారంతో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రొమాన్స్ కి పెద్ద పీట వేస్తూ సినిమా రూపొందించారని తెలుస్తోంది.
ఇప్పటికే దిమాక్ ఖరాబ్ చేశారు
ఇస్మార్ట్ శంకర్ నుంచి ఇటీవలే ఫస్ట్ లిరికల్ సాంగ్ గా దిమాక్ ఖరాబ్ విడుదల చేశారు. తెలంగాణా యాస, ప్రాసలో 'జిల్లెల్లమ్మ జిట్టా పిల్లా పాలపిట్ట' అంటూ ఈ సాంగ్ లో రెచ్చిపోయి స్టెప్పులేశారు నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరూ. ఈ మాస్ మసాలా ఐటెం సాంగ్ చూశాక కుర్రకారు దిమాక్ ఖరాబ్ అయింది. పర్ఫెక్ట్ పూరి మార్క్ కనిపిస్తోందని, ఈ సినిమాలో యువత ను ఎంటర్ టైన్ చేసే అన్ని అంశాలున్నాయని ఈ పాటతోనే ఫిక్సయ్యారు ప్రేక్షకులు.
బీచ్ ఒడ్డున రొమాన్స్.. సెక్సీ యాంగిల్
ఇస్మార్ట్ శంకర్ సినిమాకు డబుల్ దిమాక్ అనే ట్యాగ్ లైన్ పెట్టిన పూరి.. అదే కోణంలో డబుల్ దిమాక్ ఖరాబ్ అయ్యేలా హీరో రామ్, హీరోయిన్ నభా నటేష్‌తో బీచ్ ఒడ్డున రొమాన్స్ చేస్తున్న కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో బైక్ పై హీరో ఒడిలో సెక్సీ యాంగిల్లో కూర్చుంది హీరోయిన్. ఈ పోస్టర్ ద్వారా మరో అదిరిపోయే సింగిల్ `జిందాబాద్ జిందాబాద్` లిరికల్ వీడియోని జూన్ 14న విడుదల చేస్తున్నామని ప్రకటించారు.
బ్యాక్ ఎగైన్ పూరి..
గత సినిమాలతో కాస్త దళ్ అయిన పూరి జగన్నాథ్ ఈ సినిమాతో బ్యాక్ ఎగైన్ అనిపించడం ఖాయం అని ఈ పోస్టర్స్ ద్వారానే హింట్స్ ఇస్తున్నారు. పూరి మార్క్ కనిపించేలా ఊర మాస్ సెక్సీ యాంగిల్స్ మాస్ ఆడియన్స్ ని కిక్కెస్తున్నాయి. పోస్టర్లే ఈ రేంజ్లో ఉంటే ఇక టీజర్, ట్రైలర్ ఏ రేంజ్ లో ఉండనుండో అనే ఉత్కంఠ ఇప్పటినుంచే మొదలైన జనాల్లో.
ఇక రామ్ రొమాన్స్ చూడబోయేది ఎప్పుడంటే
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమా పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తుండగా.. నిధి అగర్వాల్, నభా నటేష్ ఆయనతో చిందులేస్తున్నారు. జులై 12 వ తేదీన ఈ ముగ్గురి రొమాన్స్ వెండితెరపై ఆవిష్కృతం కానుంది.