Samantha: అఖిల్ అక్కినేనికి సమంత రిటర్న్ గిఫ్ట్... బంగారం పోస్ట్ వైరల్

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ మూవీ వరల్డ్ వైడ్‌గా జూలై 10వ తేదీన విడుదలైంది. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత మూడేళ్లకు అఖిల్ చేస్తున్న మూవీ కావడంతో పాటు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లతో సినీ వర్గాల్లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈసారి ఎలాగైనా అఖిల్ హిట్ కొట్టి రేసులోకి రావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. లెనిన్ రిలీజ్ సందర్భంగా అగ్రనటి సమంత చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Also Read
మోక్షజ్ఞ కోసం పాన్ ఇండియా డైరెక్టర్? బాలయ్య వారసుడి లాంచింగ్‌‌పై క్రేజీ అప్‌డేట్!
మోక్షజ్ఞ కోసం పాన్ ఇండియా డైరెక్టర్? బాలయ్య వారసుడి లాంచింగ్‌‌పై క్రేజీ అప్‌డేట్!

లెనిన్‌లో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా.. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. రామ్‌కి, శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు, గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రలు పోషించారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. థమన్ సంగీతం అందించారు.

Samantha s Sweet Wish for Akhil Akkineni s Lenin Movie Release Goes Viral

లెనిన్ విడుదల సందర్భంగా అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు హీరో అఖిల్‌తో పాటు చిత్ర యూనిట్‌కి విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే సమంత కూడా అఖిల్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. లెనిన్ మంచి విజయం సాధించాలి, అఖిల్‌కు నా బెస్ట్ విషెస్, ఈ సినిమాపై ఇప్పటికే బ్లాక్‌బస్టర్ వైబ్ ఉంది. చిత్ర యూనిట్‌కు నా అభినందనలు అని సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. దానితో పాటు లెనిన్ ట్రైలర్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా.. అఖిల్‌కు సమంత బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడంపై అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Recommended For You
ఆఫర్ల కోసం లొంగిపోలేను.. కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్
ఆఫర్ల కోసం లొంగిపోలేను.. కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

నాగచైతన్యతో విడాకుల తర్వాత అక్కినేని కుటుంబానికి దూరంగా ఉంటున్నారు సమంత. అలాగే వారి గురించి పబ్లిక్‌గా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఇదే సమయంలో అక్కినేని - దగ్గుబాటి కుటుంబాలపై తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మించిన డెకాయిట్ మూవీ రిలీజ్ సందర్భంగా ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు సమంత. అలాగే తన కమ్ బ్యాక్ మూవీ మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విచ్చేసిన దగ్గుబాటి సురేష్ బాబుకు ఎదురెళ్లి మరి స్వాగతం తెలిపారు. పెద్దల పట్ల తన గౌరవాన్ని చూపుతూ అభిమానులను ఆకట్టుకున్నారు.

You May Also Like
ప్రియుడిపై జాన్వీకపూర్ ప్రేమ.. అక్క పెళ్లిలో దొరికిపోయిన పెద్ది బ్యూటీ!
ప్రియుడిపై జాన్వీకపూర్ ప్రేమ.. అక్క పెళ్లిలో దొరికిపోయిన పెద్ది బ్యూటీ!

అయితే మా ఇంటి బంగారం సినిమా హిట్ కావడంపై అఖిల్ అక్కినేని హర్షం వ్యక్తం చేశారు. లెనిన్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మా ఇంటి బంగారం గురించి యాంకర్ ప్రశ్నించారు. దీనిపై అఖిల్ స్పందిస్తూ... లెనిన్ ప్రమోషన్స్ వల్ల తాను మా ఇంటి బంగారం చూడలేదు, అయితే ట్రైలర్ చాలా బాగుంది, సమంత అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తాజాగా లెనిన్ సినిమా విజయం సాధించాలంటూ సమంత ఆకాంక్షించడం విశేషం. అలా అఖిల్‌కు సమంత రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: samantha akhil akkineni lenin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X