ఆఫర్ల కోసం లొంగిపోలేను.. కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిమితులు, వారికున్న హక్కులు, వారిని చూపించే విధానంపై ఇటీవల చర్చ జరుగుతోంది. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా దీనిపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇక హీరోయిన్ల పనిగంటలు కూడా కొద్ది నెలలుగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ వివాదాస్పద అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బికినీ ధరించడం, ఇంటిమేట్ సీన్స్‌పై కాజల్ అగర్వాల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Lenin Twitter Review: లెనిన్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
Lenin Twitter Review: లెనిన్ మూవీ ట్విట్టర్ రివ్యూ..

లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమతో అడుగుపెట్టిన కాజల్.. చందమామ, మగధీర, మిస్టర్ పర్ఫెక్ట్, టెంపర్, డార్లింగ్, బృందావనం తదితర సినిమాలతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగారు. తెలుగులోని అందరు అగ్రనటుల సరసన నటించారు. ఈ జనరేషన్‌లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న అతికొద్దిమంది హీరోయిన్లలో కాజల్ కూడా ఒకరు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్నారు కాజల్. ఆపై గర్భం దాల్చడంతో కొన్నాళ్లు సినీ రంగానికి దూరంగా ఉన్నారు. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించే అవకాశాలు దక్కించుకున్నారు.

Kajal Aggarwal Says No to Bikinis and Intimate Scenes Opens Up About Her Personal Boundaries in Films

తన ఇమేజ్, వయసుకు అనుగుణంగా సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు కాజల్. తెలుగుతో పాటు హిందీ సినిమాలలో ఆఫర్లు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం హిందీలో రామాయణ, తెలుగులో ఎన్‌బీకే 111లో కాజల్ నటిస్తున్నారు. ఆమె లీడ్ రోల్‌ పోషించిన మూవీ ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్. జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమా విడుదల కానుంది.

Recommended For You
'నా భర్తకు 50 మందితో అఫైర్.. అయినా వదిలిపెట్టను’
'నా భర్తకు 50 మందితో అఫైర్.. అయినా వదిలిపెట్టను’

చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బీ షిండే నిర్మిస్తున్నారు. శ్రేయస్ తల్పడే, అశ్విని భండే, హర్దీకా జోషి, మురళి శర్మ, మనిష్ వాద్వా, అతుల్ తివారి, కమలేష్ సావంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిషాంత్ భగవత్ సినిమాటోగ్రాఫర్‌గా, మంగేష్ ధాక్డే సంగీత దర్శకుడిగా, అనీశ్ మాత్రే ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా వరుసపెట్టి ఇంటర్య్వూలు ఇస్తున్నారు కాజల్. దీనిలో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

You May Also Like
చిన్మయికి 4 సార్లు అబార్షన్! నెటిజన్‌ కామెంట్స్‌కు సింగర్ దిమ్మతిరిగే కౌంటర్
చిన్మయికి 4 సార్లు అబార్షన్! నెటిజన్‌ కామెంట్స్‌కు సింగర్ దిమ్మతిరిగే కౌంటర్

గ్లామర్ ప్రపంచంలో నిలబడాలంటే మొహమాటానికి పోయి ప్రతిదానికి ఎస్ అని చెప్పకూడదు. అవసరమైతే కొన్నిసార్లు ముఖంపై నిర్మోహమాటంగా నో చెప్పడం నేర్చుకోవాలి. సినిమా ఎంత పెద్దదైనా, పెద్ద సూపర్‌స్టార్ పక్కన ఛాన్స్ అయినా సరే వ్యక్తిగత పరిమితులను నేను దాటలేదు. మనసుకు నచ్చని పనిని ధైర్యంగా వదిలేయాలి. సౌకర్యంగా లేని పాత్రలను చేయలేనని ఎన్నోసార్లు వదులుకున్నా. బికినీ ధరించడం, హద్దులు దాటే ఇంటిమేట్ సీన్స్‌లో నటించడం నాకు నచ్చదు. ఒక సినిమా కథ లేదా ఏదైనా సన్నివేశం నేను గీసుకున్న పరిమితులను దాటితే.. క్షమించండి, నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేనని మర్యాదగా చెప్పి తప్పుకుంటా. మిగిలిన విషయాలు నా నిర్ణయంపై ఎలాంటి ప్రభావం చూపవని కాజల్ అగర్వాల్ స్పష్టం చేశారు.

ప్రియుడిపై జాన్వీకపూర్ ప్రేమ.. అక్క పెళ్లిలో దొరికిపోయిన పెద్ది బ్యూటీ!
ప్రియుడిపై జాన్వీకపూర్ ప్రేమ.. అక్క పెళ్లిలో దొరికిపోయిన పెద్ది బ్యూటీ!

అంతకుముందు మరో ఇంటర్వ్యూలో హీరోయిన్ల పనిగంటలపై జరుగుతున్న చర్చపై చందమామ స్పందించారు. వర్కింగ్ అవర్స్ విషయంలో దీపిక పదుకొణె తీసుకున్న నిర్ణయానికి తాను మద్ధతు పలుకుతున్నట్లు తెలిపారు. కార్పోరేట్ రంగంలో పని గంటలకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. మరి సినీరంగంలో మాత్రం ఎందుకు ఉండకూడదు. రోజుకు ఎన్నిగంటలు పనిచేస్తానో ముందే కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌లో రాస్తాను. ఆదివారాల్లో షూటింగ్‌కు హాజరుకానని స్పష్టంగా చెబుతా, ఆ రోజు మాత్రం నా కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నా. కెరీర్ తొలినాళ్లలో మాదిరిగా 24 గంటలూ పనిచేయలేనని తెలిపారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి.

Read more about: kajal aggarwal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X