HBD Sanjay Dutt: డబుల్ ఇస్మార్ట్‌లో బిగ్ బుల్.. పూరీ మార్క్‌తో వైల్డ్ ఫస్ట్ లుక్
గతంలో కంటే ఇప్పుడు టాలీవుడ్‌లో హిట్ సినిమాలకు సీక్వెల్స్ ఎక్కువగా వస్తున్నాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ఆరంభం నుంచే భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'డబుల్ ఇస్మార్ట్' ఒకటి. వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న వీళ్లిద్దరిని హిట్ ట్రాక్ ఎక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీకి ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది.
వాస్తవానికి 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత దీనికి సీక్వెల్‌గా 'డబుల్ ఇస్మార్ట్' మూవీని చేస్తామని అప్పట్లోనే దర్శకుడు పూరీ జగన్నాథ్ వెల్లడించాడు. కానీ, ఎవరికి వాళ్లు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఉస్తాద్ రామ్ - పూరీ జగన్నాథ్ కాంబోలో 'డబుల్ ఇస్మార్ట్' రాబోతుందని అధికారిక ప్రకటన వెలువడింది. అంతేకాదు, దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయింది.

సూపర్ హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగానే సాగుతోంది. ఇందులో హీరో రామ్‌తో పాటు కీలక పాత్రను చేస్తున్న పలువురు నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదలైంది.
రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిస్తోన్నారు. అందుకు అనుగుణంగానే నేషనల్ క్రేజ్ ఉన్న నటులను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో ముఖ్యమైన 'బిగ్ బుల్' పాత్రను సంజయ్ దత్ పోషిస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని తాజాగా సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఈ సీనియర్ హీరో పూరీ మార్కు స్టైలిష్ గెటప్‌తో కనిపించారు.
ఇదిలా ఉండగా.. 'డబుల్ ఇస్మార్ట్' మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇందులో నటించే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











