Liger: బడా సంస్థ చేతికి ‘లైగర్’ హక్కులు.. రికార్డు కలెక్షన్లు వచ్చేలా ప్లాన్

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను పోషించి.. ఆ తర్వాత హీరోగా మారాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయమైన ఈ చిన్నోడు.. మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే వచ్చిన 'అర్జున్ రెడ్డి' మూవీ మరో భారీ సక్సెస్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంతో విజయ్ స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకున్నాడు. అనంతరం 'గీత గోవిందం'తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ యంగ్ హీరో.. ఆ వెంటనే 'టాక్సీవాలా'తో మరో హిట్‌ను కూడా దక్కించుకున్నాడు. ఇలా కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లను అందుకుని సత్తా చాటుకున్నాడు.

కెరీర్ తొలినాళ్లలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుని సత్తా చాటిన విజయ్ దేవరకొండ.. కొంత కాలంగా మాత్రం ఫ్లాపుల పరంపరతో సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా భారీ హిట్‌ను అందుకోవడంతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో హవాను చూపించాలన్న లక్ష్యంతో 'లైగర్' అనే సినిమాను చేస్తున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి అయిపోయింది. ఆ వెంటనే ప్రారంభించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి.

పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో రూపొందిన 'లైగర్'లో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులు పని చేస్తున్నారు. అలాగే, హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఇందులో భాగం అయ్యారు. అలాగే, అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేశారు. దీంతో ఈ సినిమా రేంజ్ ఖండాంతరాలు దాటిపోయింది. ఇక, ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందుకోసం స్పెషల్ ప్లాన్లను కూడా రెడీ చేసుకుంది. ఇందులో భాగంగానే ఇటీవలే ట్రైలర్‌తో పాటు కొన్ని పాటలను కూడా వదిలారు. వీటికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది.

Sarigama Cinemas Bagged Liger Movie Overseas Rights

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'లైగర్' మూవీపై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మూవీ ఓవర్సీస్ హక్కులను ప్రముఖ సంస్థ సరిగమ సినిమాస్ దక్కించుకుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఆగస్టు 24న ఈ సినిమా ప్రీమియర్స్‌ను అత్యధిక స్క్రీన్లలో ప్లాన్ చేశారట. అలాగే, రిలీజ్‌ను కూడా గ్రాండ్‌గా చేయబోతున్నారని తెలిసింది. ఇదే జరిగితే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉంది.

'లైగర్' మూవీలో విజయ్ దేవరకొండతో పాటు లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాను కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X