Tillu Square Trailer: ఈసారి టిల్లన్నకు దెబ్బ గట్టిగానే.. డబుల్ ఫన్&యాక్షన్​తో ట్రైలర్ అదిరిపోయిందిగా!

సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో ఓవర్​నైట్ స్టార్​గా మారిపోయాడు. తెలుగు యూత్​ ఆడియన్స్​లో డీజే టిల్లుగా సూపర్​ క్రేజీ క్యారెక్టర్​తో మోత మోగించేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అవ్వడం వల్ల డీజే టిల్లు స్క్వేర్​ను రెడీ చేశారు మేకర్స్​. ఈ సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టిల్లు స్క్వేర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని యూత్​ ఆడియెన్స్ ఎంతో ఈగర్​గా వెయిట్ చేశారు. అయితే పలు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆడియెన్స్​ను బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సాంగ్స్ మూవీపై మరింత హైప్​ను పెంచాయి. ఈ క్రమంలోనే నేడు వాలంటైన్స్​ డే సందర్భంగా ట్రైలర్​ను రిలీజ్ చేశారు మేకర్స్​. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం డీజే టిల్లు కన్నా మరింత వినోదంతో సాగింది.

Siddu Jonnalagadda Anupama Parameswaran Tillu Square Trailer Released Review Here

టిల్లుకు పెళ్లి చేయడానికి చిన్నమ్మ పెళ్లికూతురు ఫొటో పట్టుకొని ఇంటికి రావడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఆ అమ్మాయి ఫొటో చూసి వెటకారంగా తనకు పెళ్లి వద్దని చెబుతూనే తన ప్రేమ కథ గురించి చెప్పడం మొదలు పెడతాడు టిల్లు. తొలి భాగంలోని రాధిక గురించి చెబుతాడు. యా తర్వాత పబ్​లో లిల్లీని కలవడం, సేమ్ రాధికాలానే కారులో హాట్ లిప్ లాక్ సీన్ పెట్టడం వంటి చూపిస్తూ ప్రచార చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లారు.

ఈ క్రమంలోనే టిల్లు గాడు వద్దూ వద్దూ అనుకుంటూనే లిల్లీ సమస్యలను సాల్వ్ చేయడానికి మాఫియాతో గొడవ పడటం వంటివి చూపించారు. అయితే మేకర్స్ ఎక్కువగా కథను క్లారిటీగా రివీల్​ చేయలేదు. అసలు లిల్లీ ప్రాబ్లమ్​ ఏంటి? మాఫియాలో టిల్లు ఎందుకు గొడవపడ్డాడు? చివరికి సమస్య నుంచి బయటపడ్డాడా? చివరికైనా లిల్లీని పెళ్లాడాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Siddu Jonnalagadda Anupama Parameswaran Tillu Square Trailer Released Review Here

ఈ ప్రచార చిత్రంలో నా హార్ట్ చాలా వీకు అంటూ, పోయిన సారి కంటే ఈ సారి గట్టిగా తగిలేటట్టు ఉంది దెబ్బ, ఇట్లా నవ్వే మా బతుకును నవ్వుల పాలు చేస్తారు అంటూ టిల్లు గాడు తనదైన శైలిలో డైలాగ్​లు చెప్పడం మంచి ఇంట్రెస్టింగ్​గా ఉంది. ఈ క్రమంలోనే గుడ్ సెక్స్ ఈజ్ గుడ్ ఫుడ్ అంటూ అనుపమ చెప్పడం, సిద్ధుతో హాట్ లిప్ కిస్​ సీన్స్​ వంటివి చేయడం అంతా యూత్​కు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది.

డ్యాన్స్, మ్యూజిక్​, డీజే సాంగ్స్ అంతా బాగున్నాయి. చివర్లో యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. పైనల్​గా ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మొదటి భాగాన్ని మించేలా సీక్వెల్​ను తెరకెక్కించారనే నమ్మకాన్ని కలిగించారు.

OTTలో అదరగొడుతున్న క్రైమ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్... చూడాలంటే డేర్ ఉండాల్సిందే!

ఇకపోతే ఇప్పటికే రామ్ మిరియాల స్వరపరిచిన సాంగ్స్​ ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ తమన్ బ్యాక్ గ్రాండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్​టైన్మెంట్స్​, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు కలిసి సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. మరి ఈ సినిమాతో టిల్లు గాడు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X