జోష్‌లో పూరి జగన్నాథ్- ఛార్మి.. ఎంటరైన శ్రీ రెడ్డి.. డాషింగ్ డైరెక్టర్‌పై ఆటం బాంబ్!!

తెలుగు చిత్రసీమలో మహిళలపై లైంగిక దాడి రాజ్యమేలుతుందంటూ కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని లేవనెత్తిన శ్రీ రెడ్డి.. ఆ తర్వాత చెన్నైలో సెటిలైన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని మధ్యలోనే వదిలేసిన ఈ సంచలన తార సోషల్ మీడియాను మాత్రం ఫుల్లుగా వాడేస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూలోని ఎంటరై వార్తల్లో నిలుస్తోంది. తాజాగా పూరి జగన్నాథ్- ఛార్మిలపై కామెంట్ చేసి జనాల్లో చర్చలకు తెరలేపింది. మరి శ్రీ రెడ్డి ఏమంది? ఆ వివరాలపై ఓ లుక్కేద్దామా..

అక్కడే సెటిల్.. ఎప్పుడూ అదే పని

అక్కడే సెటిల్.. ఎప్పుడూ అదే పని

టాలీవుడ్ చిత్రసీమలో చేసిన హంగామా అంతా వదిలేసి తిన్నగా చెన్నైకి మకాం మార్చేసింది శ్రీ రెడ్డి. అక్కడే సెటిలై తన రెగ్యులర్ పంథాకు పదును పెడుతోంది. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడూ అదే పని అన్నట్లుగా.. ఎవరో ఒకరిపై విరుచుకుపడుతూనే ఉంది శ్రీ రెడ్డి.

అతడు, ఆమె.. పోలీసుల వరకూ వెళ్లిన వ్యవహారం

అతడు, ఆమె.. పోలీసుల వరకూ వెళ్లిన వ్యవహారం

ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్‌లకు చెందిన ఎందరో సినీ ప్రముఖులను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి.. ఇటీవలే కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్, నటి కరాటే కళ్యాణిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. వారిద్దరికీ లింకు కూడా పెట్టేస్తూ కామెంట్స్ చేసింది. చివరకు ఈ ముగ్గురి ఇష్యూ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి రచ్చ రచ్చ అయింది.

వెనక్కి తగ్గని శ్రీ రెడ్డి.. పూరి జగన్నాథ్- ఛార్మి టార్గెట్

వెనక్కి తగ్గని శ్రీ రెడ్డి.. పూరి జగన్నాథ్- ఛార్మి టార్గెట్

ఇదిలాఉంటే తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టే పోస్టుల విషయంలో మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు శ్రీ రెడ్డి. తాజాగా పూరి జగన్నాథ్- ఛార్మిలను టార్గెట్ చేస్తూ పేస్‌బుక్ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ మరోసారి ఈ అంశం చర్చల్లో నిలిచింది. పలువురు నెటిజన్లు స్పందిస్తుండటంతో ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది.

సింపుల్‌గా ఆ కామెంట్.. నెటిజన్స్ రచ్చ

సింపుల్‌గా ఆ కామెంట్.. నెటిజన్స్ రచ్చ

జస్ట్ సింపుల్‌గా ''చార్మింగ్ పూరి'' అని కామెంట్ పెట్టింది శ్రీ రెడ్డి. దీంతో ఈ కామెంట్ చూసిన నెటిజన్స్ వెంటనే అందుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు రాక్ట్ అవుతూ రచ్చ చేస్తున్నారు. కొందరైతే ''ఏ నువ్వ్ వెళ్తావా వాళ్ల మధ్యలోకీ నీకు ఎందుకే ఎవరు ఎటు వెళ్తే'' అంటూ శ్రీ రెడ్డిని ఏకిపారేస్తున్నారు.

 పూరి జగన్నాథ్- ఛార్మి క్లోజ్‌నెస్.. రూమర్స్

పూరి జగన్నాథ్- ఛార్మి క్లోజ్‌నెస్.. రూమర్స్

గత కొంతకాలంగా పూరి జగన్నాథ్- ఛార్మి కలిసి సినిమాల నిర్మాణంలో భాగమవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య క్లోజ్‌నెస్ పెరిగింది. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ నడుస్తోందంటూ అప్పట్లో రూమర్స్ వచ్చినప్పటికీ.. వాళ్ళు మాత్రం అవేవీ పట్టించుకోకుండా వరుస సినిమాలు నిర్మిస్తున్నారు.

Recommended Video

Hilarious Meme On Vijay Devarakonda Ananya Panday Viral Pic | Filmibeat Telugu
ఆ బిజీలో పూరి జగన్నాథ్- ఛార్మి

ఆ బిజీలో పూరి జగన్నాథ్- ఛార్మి

ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ సాధించిన పూరి జగన్నాథ్- ఛార్మి.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ బిజీలోనే ఉన్నారు పూరి- ఛార్మి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X