SS రాజమౌళి కూతురుతో బాలీవుడ్ స్టార్ హీరో డేట్.. జక్కన్న రియాక్షన్ ఏమిటంటే?
సినిమా రంగంలో కొన్ని విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ.. సినీ ప్రముఖుల అభిమానులకు మంచి అనుభూతిని పంచుతాయి. కొన్నిసార్లు సోషల్ మీడియాలో సెలబ్రిటీలు వెల్లడించిన అభిప్రాయలు, తమ వ్యక్తిగత విషయాలు ఆ సమయంలో పెద్దగా ప్రాచుర్యం పొందకపోయినా.. ఆ తర్వాత బయటకు వచ్చి వైరల్‌గా, ట్ ట్రెండింగ్‌గా మారుతాయి. అలా బయటకు వచ్చిన రాజమౌళి, బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాకు సంభాషణ ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. వారి మధ్య జరిగిన సంభాషణ వివరాల్లోకి వెళితే..
రాజమౌళి, సిద్దార్థ్ మల్హోత్రా సంభాషణ ప్రకారం.. జక్కన్న కూతురు మయూఖ కూడా ఈ చర్చల భాగమైంది. సిద్దార్థ్‌ను కలువాలని భావించిన మయూఖ.. ముంబైకి వెళ్లి ఆ యువ హీరోను కలిసింది. ఆ సందర్భంగా ఆమెను సాదారంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు. ఆమెతో లంచ్ డేట్ ఏర్పాటు చేశారు. అందుకు రాజమౌళి ట్విట్టర్ వేదికగా థ్యాంక్స్ చెప్పడం జరిగింది.

తన కూతురు SS మయూఖను బాగా చూసుకొన్నందుకు, టైమ్ తీసుకొని లంచ్ డేట్‌కు ఆహ్వానించినందుకు గాను సిద్దార్థ్‌కు జక్కన్న థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారు. నా కూతురును కలిసినందుకు థ్యాంక్స్ ఎలాట్ సిద్దార్థ్ మల్హోత్రా. నిన్ను కలిసిన క్షణాలను తలుచుకొని నా కుమార్తె చాలా ఎక్సైట్ అయ్యారు. మీరు ఆమెకు ఎన్నో సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్స్. మీ సలహాలతో మా జీవితాలు చాలా సులభమయ్యాయి అని రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాజమౌళి చేసిన ట్వీట్‌కు బదులుగా సిద్దార్థ్ మల్హోత్రా ట్వీట్ చేస్తూ.. హల్లో సార్.. నేను మీకు పెద్ద ఫ్యాన్‌ను. నాకు మీరు థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు. మీ అమ్మాయి చాలా మంచి వ్యక్తి. పాపులారిటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. చాలా సాధారణంగా ఉన్నారు. త్వరలోనే మిమ్మల్ని కలుసుకొంటానని ఆశిస్తున్నాను అని సిద్దార్థ్ మల్హోత్రా జవాబిచ్చాడు.
రాజమౌళి, సిద్దార్థ్ మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం రెడిట్‌లో వెలుగు చూసింది. ట్విట్టర్‌లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం అభిమానులను థ్రిల్‌కు గురి చేసింది. అయితే సిద్దార్థ్‌ను రాజమౌళి డాటర్ ఎందుకు కలిసింది? సిద్దార్థ్ ఎలాంటి సలహాలు ఇచ్చారు? సిద్దార్థ్ సలహాలకు జక్కన్న ఓ లెవెల్‌లో అలా ఎందుకు స్పందించారు? అనేవి ప్రశ్నలుగా మారాయి. ఈ ప్రశ్నలకు ఎప్పుడో ఒకప్పుడు జవాబులు దొరకడం జరుగుతుందని ఆశిద్దాం
యాంకర్ శ్యామలకు నోటీసులు.. అరెస్ట్ తప్పదా? ఆ ఇద్దరు పరారీలో.. ఈడీ రంగ ప్రవేశం
ఇదిలా ఉంటే.. RRR సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకొన్నది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్‌పై కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ఈ సందర్భంగా షూటింగ్‌కు సహకరించిన కోరాపూట్ వాసులకు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.


Click it and Unblock the Notifications











