Godfather మూవీలో పూరీ జగన్నాథ్ రోల్.. స్టార్ డైరెక్టర్ పాత్ర ఏమిటో తెలుసా?
మలయాళంలో ఘన విజయం సాధించిన లూసిఫర్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే భారీ సంచలనాలకు వేదికగా నిలుస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలను పెంచుతున్నది. తాజాగా ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నటిస్తున్నారనే వార్తను స్వయంగా చిరంజీవి వెల్లడించడంతో అటు పూరీ అభిమానుల్లోను, మెగా ఫ్యాన్స్‌లోను ఆనందం నెలకొన్నది. ఇక లూసిఫర్ రీమేక్ గాడ్‌ఫాదర్ చిత్రంలో పూరీ జగన్నాథ్ పోషించే పాత్ర, ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమై వివరాలు మీ కోసం..

సల్మాన్ ఖాన్ చేరికతో
గాడ్ ఫాదర్ చిత్రం చిరంజీవి స్టామినాకు తగినట్టుగానే డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమాలో తారల వెలుగు జిలుగులు భారీగానే కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలోకి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రావడంతో గాడ్ ఫాదర్ చిత్రం ప్యాన్ ఇండియా మూవీగా మారిపోయింది. దాంతో హిందీ సినిమా పరిశ్రమలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

సల్మాన్ ఖాన్‌కు 20 కోట్లు
గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ నటించడానికి భారీగానే రెమ్యునరేషన్‌ను నిర్మాతలు ముట్టజెప్పినట్టు సమాచారం. ట్రేడ్, సినీ వర్గాల సమాచారం ప్రకారం సల్మాన్‌కు అతిథి పాత్రలో నటించేందుకు 20 కోట్ల రూపాయలు అందజేసినట్టు సమాచారం. ఇటీవలే ముంబైలో చిరంజీవి, సల్మాన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడం తెలిసిందే. ఈ చిత్రంలో సల్మాన్ పాత్ర కేవలం 20 నిమిషాల నిడివి మాత్రమే అని తెలిసింది.

గాడ్ ఫాదర్‌లోకి పూరీ జగన్నాథ్
గాడ్ ఫాదర్‌లోకి పూరీ జగన్నాథ్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టుపై మరింత క్రేజ్ పెరిగింది. లూసిఫర్ రీమేక్‌లో పూరీ జగన్నాథ్ నటిస్తున్నారనే విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించడంతో ఫ్యాన్స్‌లో హర్షం వ్యక్తమైంది. పూరీ జగన్నాథ్‌లో నటుడు కావాలనే కోరికను అర్ధం చేసుకొన్న చిరంజీవి.. ఆయనకు ఓ కీలక పాత్రలో కనిపించే ఆఫర్‌ను ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

నర్సీపట్నం నుంచి టాలీవుడ్‌కు అంటూ
పూరీ జగన్నాథ్ నటుడిగా పరిచయం చేస్తున్నట్టు చిరంజీవి ట్వీట్ చేస్తూ.. నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే పూరీ జగన్నాథ్‌ను గాడ్ ఫాదర్ చిత్రంలో స్పెషల్ రోల్‌లో పరిచయం చేస్తున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు.

జర్నలిస్టు పాత్రలో పూరీ జగన్నాథ్
అయితే గాడ్ ఫాదర్ చిత్రంలో పూరీ జగన్నాథ్ పోషించే పాత్ర విషయానికి వస్తే.. సినిమా ఆరంభంలో పాత్రలను పరిచయం చేసే జర్నలిస్టు పాత్రలో ఈ స్టార్ డైరెక్టర్ కనిపించబోతున్నట్టు సమాచారం. గాడ్ ఫాదర్ సినిమాను డ్రైవ్ చేసే పాత్రను పూరీ పోషిస్తున్నట్టు సమాచారం. ఈ పాత్ర ఈ సినిమాకు కీలకంగా మారబోతున్నట్టు తెలిసింది.

గాడ్‌ఫాదర్ చిత్రంలో..
ఇక గాడ్ ఫాదర్ సినిమా విషయానికి వస్తే.. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, హరీష్ ఉత్తమన్, జయప్రకాశ్, వంశీ కృష్ణ తదితరులు నటిస్తున్నారు. మరికొంత మంది నటీనటులు వివరాలు అధికారికంగా యూనిట్ ప్రకటించనున్నది.


Click it and Unblock the Notifications











