twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు : థియేటర్లకు శుభవార్త, వారికి మాత్రం షాక్

    |

    కరోనా మహమ్మారి ఉధృతి ఇప్పుడు కాస్త తగ్గింది. దేంతో తెలంగాణాలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తి వేయగా ఏపీలో కేవలం నైట్ కర్ఫ్యూ మాత్రమే కొనసాగుతోంది. తాజాగా సినిమా థియేటర్ యజమానులకు తెలంగాణా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే

    థియేటర్లకు అనుమతి

    థియేటర్లకు అనుమతి

    తెలంగాణలో దాదాపుగా అన్ని సడలింపులు ఇచ్చారు. తాజాగా తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

    మంత్రి హామీతో

    మంత్రి హామీతో

    కొద్ది రోజుల క్రితం మంత్రి హామీతో త్వరలో సినిమా థియేటర్లు ఓపెన్ చేసి సినిమాలు రన్ చేయాలని కూడా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. అయితే ఈ నెల 23 నుంచి తెలంగాణ అంతటా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభం కానున్నాయని ప్రచారం జరిగినా అది నిఅజం కాదని తరువాత ఛాంబర్ క్లారిటీ ఇచ్చింది.

    Vijay Devarakonda: రచ్చ లేపాడుగా...ఒకే రోజున రెండు రికార్డులు!

    వారు కోరిన పిమ్మట

    వారు కోరిన పిమ్మట

    పర్మిషన్ ఇచ్చిన సంగతి నిజమే కానీ థియేటర్ల ఓపెనింగ్ విషయంలో నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఇక టాలీవుడ్ సినీ నిర్మాతలు, తెలంగాణ ప్రాంత ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు అనుమతులు ఇచ్చింది.

     పార్కింగ్‌ ఫీజు వసూల్

    పార్కింగ్‌ ఫీజు వసూల్

    అలాగే 2017లో తీసుకొచ్చిన జీఓ.75 విషయంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని వారు కోరారు. థియేటర్‌కు వచ్చే వాహనదారుల నుంచి పార్కింగ్‌ రుసుము వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. ఈ క్రమంలో సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

    Recommended Video

    Telugu producers Ask For 100% Theatre Occupancy |తమిళనాడు లో ఇచ్చినట్టే ఇక్కడకూడా | Filmibeat Telugu
    అక్కడ నో ఫీజ్

    అక్కడ నో ఫీజ్

    అయితే, మల్టీప్లెక్స్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లలో మాత్రం యాథావిధిగా నో పార్కింగ్‌ ఫీజు విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. ఇక గతంలో సినిమా థియేటర్లలో ఎలాంటి పార్కింగ్‌ ఫీజు వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.

    English summary
    Telangana new G.O allows parking fees in single screen theaters only. NO PARKING FEES at multiplexes and commercial establishments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X