This week Tollywood releases: ఏకంగా విడుదలవుతున్న 8 సినిమాలు.. అవి ఏమింటంటే?
ప్రజలు కరోనాకు ముందువలే థియేటర్లకు వస్తుండటంతో నిర్మాతలకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ప్రతి శుక్రవారం తెలుగు చలనచిత్ర పరిశ్రమను కళకళలాడించేలా చేస్తోంది. పోటీకి ఎన్ని సినిమాలున్నా బాక్సాఫీస్ దగ్గరే తేల్చుకుందమనే రీతిలో అందరూ తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈనెల 15, 16 తేదీల్లో ఏకంగా ఎనిమిది సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒక సినిమా మరో సినిమాతో పోటీపడే రీతిలో వాతావరణం ఉంది. 16న విడుదలకు సిద్ధమైన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమామీదే అన్నింటికన్నా ఎక్కువ అంచనాలున్నాయి.
సుధీర్ బాబు కృతి శెట్టిలతో ఇంద్రగంటి మోహన్ కృష్ణ చేసిన ఈ ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ ప్రేమకథ ఎటువంటి ఫలితాన్నిస్తుందా అనే ఉత్కంట పరిశ్రమ వర్గాల్లో ఉంది.
కచ్చితంగా హిట్టు కొట్టే తీరాలంటూ కసిగా ఉన్న కిరణ్ అబ్బవరంకు 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాతో పలకరించబోతున్నారు. ఎస్ఆర్ కళ్యాణమండపం కాంబినేషన్ కాబట్టి ఏదైనా కొత్తదనం ఉంటుందేమోనని భావిస్తున్నారు. ఓ బేబీ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ నుంచి మరో కొరియన్ రీమేక్ కథ 'శాకినీ డాకిని'. నివేదా థామస్, రెజీనా ముఖ్యపాత్రధారులుగా రూపొందింది.

డబ్బింగ్ సినిమా 'కె3 కోటికొక్కడు' కోసం నిర్మాతలు ప్రచారాన్ని బాగా చేస్తున్నారు. కిచ్చ సుదీప్ కి తెలుగులో మార్కెట్ ఉంది కాబట్టి నిర్మాతలు దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ కన్నడంలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. అదే రోజు బిగ్ బాస్ సన్నీ సకలగుణాభిరామ, అంఅః, నేను నువ్వు కూడా రాబోతున్నాయి. 17న శింబు 'ది లైఫ్ అఫ్ ముత్తు'ని స్రవంతి రవికిషోర్ రంగంలోకి దించుతున్నారు. ముత్తు పేరుతో విడుదలకు సిద్ధమైంది. ఇన్ని సినిమాలున్నప్పటికీ దేనికి క్రేజ్ వస్తుందో, మౌత్ టాక్ తో ఏ సినిమా ఆడుతుందోనని తెలుగు చలనచిత్ర పరిశ్రమ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.


Click it and Unblock the Notifications











