Actors Donations: మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్ .. ఎవరెంత ఇచ్చారంటే..
గత వారంరోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. భారీ ఆస్తినష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో వరద బాదితులకు పలువురు తెలుగు చిత్ర పరిశ్రమ అండగా నిలుస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సాయం చేయడానికి ముందుకోస్తుంది. ఎవరెవరు విరాళాలు ప్రకటించారు. ఎంత ప్రకటించారో ఇప్పుడు చూద్దాం..
Bigg Boss Telugu 8: కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్స్! ఆ హాట్ బ్యూటీకే హయ్యెస్ట్.. !!
అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ అండ్ పవర్ స్టార్ నిర్మాతల సాయం..
టాలీవుడ్ స్టార్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ నిర్మాతలైన ఎస్ రాధాకృష్ణ (చినబాబు). ఎస్. నాగవంశీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 లక్షల రూపాయలు అండ్ తెలంగాణ రాష్ట్రానికి 25 లక్షలు మొత్తం 50 లక్షలు విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు ఇవాళ (మంగళవారం) సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అలాగే భారీ వర్షాల కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతున్నందు త్రివిక్రమ్, నిర్మాతల మనసు కలచివేసిందని అన్నారు. ఈ విపత్తు నుంచి తెలుగు ఉభయ రాష్ట్ర ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నామని సంతాపం తెలిపారు.

జై బాలయ్య
కోట్లాదిమంది గుండెల్లో స్థానం సంపాదించకున్న టాలీవుడ్ ప్రముఖ హీరో బాలకృష్ణ కూడా వరద బాదితులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికన విరాళం ప్రకటించారు. '50 ఏళ్ళ క్రితం మా నాన్న నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది.. వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీకోసం. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను.రెండు రాష్ట్రాలలో మళ్లీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నానని' బాలయ్య రాసుకొచ్చారు.
గొప్ప మనసు చాటుకున్న జూనియర ఎన్టీఆర్
ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ నుంచి పలువురు హీరోలు విరాళాలు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్( కోటి రూపాయలు ఏపీ, తెలంగాణ చెరి 50 లక్షలు) విశ్వక్ సేన్(చెరి 5లక్షల రూపాయలు), డీజే టిల్లు హీరో సిద్ధు, సందీప్ కిషన్, బన్నీ వాసు వంటి వారు వరద బాధితులకు ఇండస్ట్రీ నుంచి విరాళాలు ప్రకటించారు. తమకు తోచినంత సాయం చేస్తూ తెలుగు రాష్ట్రాలకు సాయం అందిస్తున్న హీరోలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఏపీలో ఇప్పటికి కొన్ని కాలనీల్లో అనేక కొంతమంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. సర్వం కోల్పోయామంటూ కట్టుబట్టలే మిగిలాయంటూ వరద బాధితులు కంటతడి పెడుతున్నారు.
సిద్దు జొన్నల గడ్డ విరాళం
తాజాగా యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ తన గొప్ప మనసు చాటుకున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరద సహాయ నిధికి రూ. 15 లక్షల చొప్పున మొత్తం 30 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











