ప్రతీ మహిళ విజయం వెనుక పురుషుడు.. నా విజయం వెనుక ఎవరంటే? ఉపాసన ఎమోషనల్ కామెంట్స్!

గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా, మెగా పవర్ స్టార్ గా సినీ రంగంలో అడుగు పెట్టిన ఇతడు.. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోగా మారిపోయాడు. అద్భుతమైన చిత్రాలు చేస్తూ అందరి చేత ఆహా అనిపించుకున్నాడు. ముఖ్యంగా మొదటి సినిమా చిరుతతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాధించుకున్నాడు. ఆ తర్వాత చేసిన మగధీర బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో ఆయన రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇక తర్వాత వచ్చిన చిత్రాల్లోనూ అద్భుతమైన నటన కనబర్చి తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకున్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయి.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా అద్భుతమైన సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న ఇతడు.. పర్సనల్ లైఫ్ లో కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. 2012లో జూన్ 14వ తేదీన ఉపాసనను ప్రేమించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరికీ పెళ్లి జరిగిన తర్వాత చాలా మంది వీరిని ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా ఉపాసన అందంపై విపరీతమైన కామెంట్లు వచ్చాయి. కానీ వాటేమిటినీ వీళ్లు పట్టించుకోకుండా చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఇద్దరూ కెరియర్ లో బాగా సెటిల్ అవుతూనే.. తమకు స్పెషల్ గా సమయం కేటాయించుకున్నారు.

Recommended Video

Vijayakanth మరణంపై Salaar నటి ఎమోషనల్..ఏడ్చేసిన Vishal | Telugu Filmibeat

Upasana Konidela Emotional Comments on Ram Charan Check Details

ఇలా పదకొండేళ్ల తర్వాత ఈ జంట ఓ పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది. మెగా వారసురాలు అయిన ఆ పాపకు క్లింకారా కొణిదెల అనే పేరును పెట్టినట్లు కూడా వివరించారు. అయితే మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఇంటి పెద్ద కోడలిగా ఒక్కతాటిపై నడిపిస్తోంది ఉపాసన. అలాగే త అపోలో హాస్పిటల్స్ బాధ్యత కూడా తీసుకుని తన భుజాలపై వేసుకుంది. ఇలా ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ అటు పుట్టినింటి, ఇటు మెట్టినింటి గౌరవం కాపాడుకుంటూ వస్తుంది. అయితే తాజాగా ఈ క్యూట్ కపుల్ ఫోర్బ్స్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈక్రమంలోనే చెర్రీ, ఉప్సీలు తమ ప్రేమ గురంచి చెప్పుకు వచ్చారు. ఉపాసన అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది.

తనకు ఎక్కువగా వినడం అంటే ఇష్టం అని.. ఎప్పుడూ తన భర్త చెప్పేది ఎక్కువగా వింటూ ఉంటానని ఉపాసన అనగా.. చెర్రీ ఇక నుంచి తాను చెప్పేదే నేను వింటానంటూ చెప్పుకొచ్చాడు. అలాగే రామ్ చరణ్ కెరియర్ ను బ్యాలెన్స్ చేసింది తన భార్య ఉపాసననే అని... ఆమే తన బలం, ధైర్యం అంటూ తెలిపాడు. అలాగే ఆమె తన వెంటనే ఉండటమే తనకు అసలైన బాలన్ని ఇస్తుందని.. అలాగే ఉప్సీ తనకోసం కేటాయించే సమయం కూడా తన బలం అని పేర్కొన్నాడు. మరోవైపు ఉపాసన కూడా భద్రతే తన బలం అని వెల్లడించింది. ఏదైనా బంధం బలంగా ఉండాలంటే ఆ ఇద్దరి మధ్య నమ్మకం, సహనం కచ్చితంగా ఉండాలని తెలిపింది.

Upasana Konidela Emotional Comments on Ram Charan Check Details

అంతే కాకుండా ప్రతీ పురుషుడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉంటుందని అంతా అంటారని.. కానీ ఓ స్త్రీ విజయం వెనకాల తనకు ఎప్పుడూ సపోర్ట్ చేసే భర్త ఉంటాడని ఉపాసన చెప్పుకు వచ్చింది. అలాగే తన జీవితంలో తనకు ఎప్పుడూ సపోర్టింగ్ గా ఉండే తన భర్త వల్లే తాను ఇంత సక్సెస్ అయినట్లు వివరించింది. ఇదే విషయాన్ని ఎక్స్ వేధికగా వ్యక్తం చేసింది ఉపాసన. ఈమె చేసిన పోస్ట్ చూసిన చాలా మంది అభిమానులు వీరి ప్రేమకు ఫిదా అయిపోతున్నారు. భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అంటూ వీరిని ఉదాహరణగా చూపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X