Upasana Konidela: చిరంజీవి భార్య సురేఖ పుట్టినరోజు.. మళ్లీ గుడ్ న్యూస్ చెప్పిన కోడలు ఉపాసన!
నేడు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ బర్త్ డే. ఈ సందర్భంగా ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి వినుత్నంగా ఓ కవితను రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే వీరి ముద్దుల కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల.. అత్తమ్మ సురేఖ బర్త్ డే సందర్భంగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అసలు ఉపాసన చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి.. అనేది ఈ స్టోరీలో చూసేద్దాం.
మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాలు చేయకపోయినా.. ఉపాసనకు హీరోయిన్ కు మించిన క్రేజ్ ఉంటుంది. రామ్ చరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాక.. అటు ఇంటి బాధ్యతలను మరోవైపు బిజినెస్ పనులను చూసుకుంటూ బిజీగా గడుపుతుంది. మరో వైపు సినిమాలతో బిజి బిజీగా ఉంటోన్న భర్తకు అండగా ఉంటుంది. తనదైన సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన.

అపోలో హాస్పిటల్ చైర్మన్ సి. ప్రతాప్ రెడ్డి మనవరాలిగా, ఆయన వార సత్వాన్ని నిలబెడుతూ వైద్య రంగంలో తన దైన సేవా కార్యక్రమాలు ఉపాసన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ పలు సామాజిక కార్యక్రమాలు చేస్తోంది. ఇవే కాకుండా 'బి పాజిటివ్' అనే హెల్త్ మ్యాగజైన్ కు ఉపాసన ఎడిటర్. ఇలా సేవా రంగంలో తనదైన శైలిలో దూసుకెళుతోన్న ఉపాసన మళ్లీ ఓ గుడ్ న్యూస్ చెప్పేసింది.
రామ్ చరణ్, ఉపాసన జంటకు 11ఏళ్ల తర్వాత క్లీంకార జన్మించింది. ఇక క్లీంకార రావడంతో మెగా ఇంట సంబరాలు డబుల్ అయ్యాయి. క్లీంకార ఎంట్రీతో ఇంట్లో అంతా మంచే జరుగుతుందని అంటున్నారు. ఇక ఆ విషయం పక్కన పెడితే.. ఉపాసన అత్తమ్మ చిరంజీవి భార్య సురేఖ బర్త్ డే. అందరూ ఆమెకు విషెష్ చెబుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి కూడా రేఖ.. జీవన రేఖ అంటూ ఓ కవితను రాసుకువచ్చారు. భార్య సురేఖకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఉపాసన సైతం తన అత్తమ్మ బర్త్ డే సందర్భంగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తాను ఓ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇన్ స్టా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసంది. ఉపాసన అత్తమ్మ సురేఖ పుట్టినరోజు సందర్భంగా కొత్త వెంచర్‌ను ప్రారంభించింది. అత్తమ్మస్ కిచెన్ స్టార్ట్ చేసిందనందుకు ఆనందంగా ఉందని ఇన్ స్టాలో రాసుకువచ్చింది. రుచి సంప్రదాయాన్ని కలిసే చోట బంధాలు తరతరాలుగా నిలబడతాయి.. సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ఆస్వాదించండి - నేరుగా మా వంటగది నుండి మీ ఇంటికి... అంటూ రాసుకువచ్చింది.
Geetha Madhuri పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి దంపతులు.. వారసుడా? వారసురాలా?
https://athammaskitchen.com అనే వెబ్ సైట్ ద్వారా వంటకాలను బుక్ చేసుకుని ఇంటికి తెచ్చుకోవచ్చన్నమాట. పూర్తి వివరాలు త్వరలో తెలియనుండనున్నాయి. ఓన్లీ హైదరాబాద్ లోనే పంపిణీ చేస్తారా లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఉపాసన స్టార్ట్ చేసిన బిజినెస్ గురించి నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. అత్తకు తగ్గ కోడలు అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన పెట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











