Liger: ముంబైలో హీరోయిన్‌తో విజయ్ సందడి.. యమ రొమాంటిక్‌గా ప్లాన్

క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు హైదరాబాద్ కుర్రాడు విజయ్ దేవరకొండ. ఫస్ట్ మూవీలోనే తనదైన నటనతో అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు భారీ హిట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే 'అర్జున్ రెడ్డి' మూవీ మరో భారీ సక్సెస్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంతో విజయ్ స్టార్‌గా ఎదిగిపోయాడు. అనంతరం 'గీత గోవిందం'తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ యంగ్ హీరో.. ఆ వెంటనే 'టాక్సీవాలా'తో మరో హిట్‌ను కూడా దక్కించుకున్నాడు. దీంతో అతడి కెరీర్‌ గ్రాఫ్‌తో పాటు మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది.

చాలా తక్కువ సమయంలోనే ఎన్నో విజయాలతో సత్తా చాటిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత వరుసగా పరాజయాలనే ఎదుర్కొంటోన్నాడు. 'నోటా' నుంచి మొదలుకొని వరుసగా 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి ఫ్లాపులను చవి చూశాడు. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశలో ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న కసితో ఉన్నాడు. ఇందుకోసం ఈ యంగ్ హీరో ప్రస్తుతం టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

Vijay devarakonda and Ananya Panday Participates for Liger Song

విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కలయికలో పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో రూపొందుతోన్న 'లైగర్' మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడుతుండడంతో చాలా కాలం వరకూ టాకీ పార్ట్ మాత్రం కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే గోవాలో ఫైనల్ షెడ్యూల్‌ను మొదలు పెట్టడంతో పాటు వెంటనే దాన్ని పూర్తి చేసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'లైగర్' మూవీకి సంబంధించి ప్రస్తుతం ఓ పాటకు సంబంధించిన షూట్‌ను జరుపుతున్నారని ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ముంబైలో వేసిన ప్రత్యేకమైన ఇండోర్ సెట్‌లో హీరో విజయ్ దేవరకొండ.. హీరోయిన్ అనన్య పాండే మధ్యన ఓ అదిరిపోయే రొమాంటిక్ సాంగ్‌ను చేస్తున్నారట. ఇది సినిమాలోనే హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్ మధ్యన పూరీ జగన్నాథ్ మార్క్ రొమాన్స్‌ను చూపించబోతున్నారని సమాచారం. ఈ సాంగ్‌తో సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని అంటున్నారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'లైగర్' మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాను కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X