విజయ్ దేవరకొండకు బీర్లతో అభిషేకాలు.. అభిమానుల పిచ్చి మామూలుగా లేదు
ఒక స్టార్ హీరో సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే సినిమా ఎనౌన్స్మెంట్ నుంచి రిలీజ్ అయ్యాక రికార్డుల వరకు అభిమానులు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానుల హడావుడి అనేది కామన్. ఇక పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడితో అభిమాన హీరో సినిమా చేస్తున్నాడు అంటే ఆ హంగామా డోస్ మామూలుగా ఉండదు. విజయ్ దేవరకొండ కొత్త సినిమా పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Recommended Video

లైగర్.. అంచనాలు మామూలుగా లేవు
ఒకప్పుడు సినిమా విడుదల రోజు హంగామా మొదలు పెట్టె అభిమానులు ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రచ్చ మొదలు పెట్టేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మామూలుగా లేవు.

దాదాపు ఏడాది తరువాత..
గత ఏడాది సెట్స్ పైకి వచ్చిన ఈ ప్రాజెక్ట్ లాక్ డౌన్ కారణంగా చాలా కాలం పాటు షూటింగ్ కు బ్రేక్ వేయాల్సి వచ్చింది. దాదాపు ఏడాది అనంతరం దర్శకుడు పూరి జగన్నాథ్ మళ్ళీ సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు. మొత్తానికి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా సోషల్ మీడియా ద్వారా వదిలారు.

బీర్లతో అభిషేకాలు చేసిన ఫ్యాన్స్
అయితే సాధారణంగా ఏ హీరో కటౌట్స్ కైనా పాలతో అభిషేకం చేయడం కామన్. కానీ విజయ్ దేవరకొండ పోస్టర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో అభిమానులు ఏకంగా బీర్లతో అభిషేకం చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. ఓ రకంగా చిత్ర యూనిట్ సబ్యులకు ఈ న్యూస్ మంచి కిక్కిచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో గట్టిగానే స్పందిస్తున్నారు కూడా.

మ్యాడ్ నెస్ మొదలైంది..
బీర్లు పొంగిస్తూ విజయ్ లైగర్ కటౌట్స్ కు అభిషేకాలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మి కౌర్ కూడా స్పందించారు. మ్యాడ్ నెస్ మొదలైంది అంటూ పాజిటివ్ గా కామెంట్ చేసింది. ఇక సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్ లో ఈ లైగర్ సినిమాకు కరణ్ జోహార్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











