బాలీవుడ్ బ్యూటీని హైదరాబాద్ తీసుకొస్తున్న విజయ్: అదిరిపోయే ప్లాన్ వేసిన డైరెక్టర్

కెరీర్ ఆరంభంలోనే చిన్న చిన్న పాత్రల్లో నటించి.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. మొదటి సినిమాలో డీసెంట్‌గా కనిపించిన అతడు.. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'లో మాత్రం వైలెంట్‌గా దర్శనమిచ్చాడు. అదే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. అనంతరం వరుస విజయాలతో స్టార్‌గా ఎదిగిపోయాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఇలాంటి సమయంలో ఏకంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ అప్‌డేట్ వచ్చింది.

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రమే 'లైగర్'. పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ముంబై నగరంలో జరుగుతోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో ఇది రూపొందుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరగబోతుందట. ఇక్కడ హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్లను చిత్రీకరించడంతో పాటు యాక్షన్ పార్టును కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. అలాగే, ఓ పాటను సైతం తీయబోతున్నారని అంటున్నారు.

Vijay devarakonda Liger Hyderabad Schedule From Last Week

విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'లైగర్' సినిమాను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X