విజయ్ దేవరకొండ 'లైగర్' రిలీజ్ డేట్ అదేనా.. స్పెషల్ గా ప్లాన్ చేసిన ఛార్మి.. కౌంట్ డౌన్ స్టార్ట్
పూరి జగన్నాథ్ లాంటి డేరింగ్ అండ్ డ్యాషింగ్ దర్శకుడితో అభిమాన హీరో సినిమా చేస్తున్నాడు అంటే ఆ హంగామా డోస్ మామూలుగా ఉండదు. విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీరి కాంబినేషన్ లో లైగర్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల కొత్త పోస్టర్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సినిమాకు సంబంధించిన రిలీజ్ పై ఒక నిర్ణయానికి వచ్చింది.

పోస్టర్ వైరల్
ఒకప్పుడు సినిమా విడుదల రోజు హంగామా మొదలు పెట్టె అభిమానులు ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రచ్చ మొదలు పెట్టేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా పోస్టర్ విడుదలైనప్పుడే ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మామూలుగా లేవు.

ఏడాది బ్రేక్ తరువాత..
2019లో ఇస్మార్ శాంకర్ సినిమా తరువాత పూరి ఈ సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు. అయితే ఈ ప్రాజెక్ట్ లాక్ డౌన్ కారణంగా చాలా కాలం పాటు షూటింగ్ కు బ్రేక్ వేయాల్సి వచ్చింది. దాదాపు ఏడాది అనంతరం దర్శకుడు పూరి జగన్నాథ్ మళ్ళీ సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు. మొత్తానికి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఛార్మి స్పెషల్ వీడియో
ఇక ప్రతి ఒక్కరు సినిమా రిలీజ్ డేట్స్ పై క్లారిటీ ఇస్తున్న సమయంలో లైగర్ నిర్మాతలు కూడా లైగర్ పై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. హీరోయిన్ అనన్య పాండేతో కలిసి ఛార్మి ఒక స్పెషల్ అప్డేట్ కూడా ఇచ్చారు. తెలుగు తమిళ్ మలయాళం హిందీ కన్నడ భాషల్లో లైగర్ భారీ స్థాయిలో విడుదల కానున్నట్లు చెబుతూ వీడియో వదిలారు.

రిలీజ్ డేట్ ఫిక్స్
ఇక గురువారం ఉదయం 8:14గంటలకు సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. ఇక సినిమా విడుదలపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. జూలై 23 అని మొన్నటి వరకు ఒక టాక్ వచ్చింది. ఆ డేట్ ఎంతవరకు నిజమో రేపటి అప్డేట్ తో తెలిసిపోతుంది. ఇక సినిమాకు కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











