Liger గ్యాంగ్ రచ్చ మామూలుగా లేదుగా.. హీరోయిన్ అందానికి మైక్ టైజన్ గాండ్రింపు
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టు గా తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. చిత్ర యూనిట్ అమెరికాలో ఒక కీలకమైన షెడ్యూల్ ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది. అయితే ఈ సన్నివేశాల్లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా పాల్గొంటున్నాడు. హాలీవుడ్ చిత్రాల్లో నటించిన మైక్ టైసన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మాత్రం ఇంతవరకు నటించలేదు కానీ మొదటి సారి అతను లైగర్ సినిమా ద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. ఇక చిత్ర యూనిట్ షూటింగ్ లొకేషన్ లో దిగిన కొన్ని ఆహ్లాదకరమైన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.

ఎప్పుడూ లేని విధంగా..
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సినిమా కోసం భారీ స్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నారు. బడ్జెట్ విషయంలోనే కాకుండా టైమ్ విషయంలో కూడా అతను చాలా కొత్తగా ఆలోచించాడు. పూరి జగన్నాథ్ ఈ సినిమాని మొదలు పెడితే వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అనుకుంటాడు. కానీ మొదటి సారి అతను ఒక సినిమా కోసం చాలా ఎక్కువ సమయం కేటాయించాడు. దానికి తోడు కరోనా కూడా మరింత ఆలస్యం చేసింది.

ఫుల్ మీల్స్ దొరికినట్లే..
పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. దానికి తోడు సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. అంతే కాకుండా లైగర్ అనే టైటిల్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంది. వెండితెరపై మాస్ ప్రేక్షకులకు అయితే ఫుల్ మీల్స్ దొరికినట్లే అని చెప్పవచ్చు.

లైగర్ ఫ్యామిలీలో మైక్ టైజన్
ఇక సినిమాకు సంబంధించిన అన్ని అంశాలు కూడా ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక అంతకు మించి అనేలా మైక్ టైసన్ ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అతని కోసమే ప్రత్యేకంగా యూఎస్ షెడ్యూల్ ను కూడా ప్లాన్ చేశారు. ఇటీవల ఆ షెడ్యూల్ ని మొదలుపెట్టారు. ఇక షూటింగ్ లో మైక్ టైసన్ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి సరదాగా ఫోటోలకి ఫోజులు ఇచ్చారు.
Recommended Video

అనన్య పాండే అందంపై గాండ్రింపు
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ చార్మి తో మైక్ టైసన్ చాలా కూల్ గా కనిపించగా.. హీరోయిన్ అనన్య పాండేతో మాత్రం మైక్ టైసన్ విభిన్నంగా పోజులు ఇచ్చారు. ఆమె అందానికి దగ్గరగా మైక్ టైసన్ గాండ్రింపు తరహాలో ఫోటోకి ఫోజులు ఇచ్చారు. అనన్య పాండే మాత్రం చాలా కూల్ గా నవ్వుతూ కనిపించింది. ఏదేమైనా మైక్ టైసన్ లైగర్ ఫ్యామిలీ లో చాలా ఈజీగా కలిసిపోయాడు అనిపిస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











