‘లైగర్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్: అదొక్కటే బ్యాలెన్స్.. మిగతాదంతా కంప్లీట్
'ఇస్మార్ట్ శంకర్'తో భారీ విజయాన్ని అందుకున్న డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ముంబై నగరంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో నిర్విరామంగా సాగుతోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ గురించి తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. 'లైగర్' మూవీ షూటింగ్ పూర్తి కావొచ్చిందట. ప్రస్తుతం ముంబైలో జరుగుతోన్న షెడ్యూల్ త్వరలోనే కంప్లీట్ కానుందట. దీంతో క్లైమాక్స్ మినహా మిగిలిన పార్ట్ మొత్తం పూర్తయినట్లు అవుతుందని తెలుస్తోంది. ఇక, ఎంతో కీలకమైన పతాక సన్నివేశాలను ఏప్రిల్ నెలలో ప్రారంభిస్తారని.. ఇరవై రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ఆ ఎపిసోడ్‌ను షూట్ చేసేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం విజయ్ కొద్ది రోజులుగా ఇంటర్నేషనల్ ట్రైనర్లతో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకూ నేర్చేసుకున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది.

ఎంతో ప్రతిష్టత్మకంగా రాబోతున్న 'లైగర్'ను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.


Click it and Unblock the Notifications











