Don't Miss!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
విజయ్ దేవరకొండ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆ కారణంగా లైగర్ టీజర్ వాయిదా..
రౌడి స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నేడు రౌడీ స్టార్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో గత వారం నుంచే అడ్వాన్స్ విషెస్ ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి. ఇక నేడు టీజర్ రానున్నట్లు ఎదురుచూసిన ఫ్యాన్స్ కు చివరకు నిరాశే మిగిలింది. ఒక కారణంగా విజయ్ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు.
అందరి ఫోకస్.. టీజర్ పైనే..
విజయ్ దేవరకొండ మొదటిసారి చేస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లైగర్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని ప్రముఖ భాషల్లో విడుదల కానుంది. ఇక ఫస్ట్ లుక్ కు భారీ రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు అందరి ఫోకస్ కూడా టీజర్ పైన ఉంది.
ఫ్యాన్స్ కు నచ్చే విదంగా..
గత నెల రోజులుగా లైగర్ కు సంబంధించిన రూమర్స్ చాలానే వైరల్ అయ్యాయి. మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావాదంతో సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు టాక్ వచ్చింది. నిజానికి పూరి జగన్నాథ్ వారం రోజుల క్రితమే టీజర్ ను రెడీ చేసి ఉంచాడు. ఫ్యాన్స్ కు నచ్చే విదంగా కట్ చేసి ఉంచారట.
చివరికి నిరాశే ఎదురైంది
ఇక ఆదివారం ఉదయాన్నే టీజర్ విడుదల అవుతుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులకు చివరికి నిరాశే ఎదురైంది. సినిమా టీజర్ ఈ రోజు విడుదల కావడం లేదని, వాయిదా వేసినట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా అప్సెట్ అయ్యారు. అయినప్పటికీ చిత్ర యూనిట్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని కామెంట్ చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని..
దేశవ్యాప్తంగా కరోనా కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సమయంలో టీజర్ ను విడుదల చేయడం సరైనది కాదని పూరి టీమ్ వివరణ ఇచ్చింది. పరిస్థితులు మళ్ళీ సాధారణంగా మారిన తరువాతే టీజర్ ఉంటుందని తప్పకుండా అప్పుడు అంచనాలకు తగ్గట్లుగానే విజయ్ ను మీ ముందు ఉంచుతామని చెప్పారు. అదే విదంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కఠిన సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.