నాని దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. అమేజింగ్ కాంబో!

రౌడి స్టార్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ ఫైటర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాతో అయినా ఆడియెన్స్ ని మంచి సినిమాతో ఆకట్టుకోవాలని కమర్షియల్ కాన్సెప్ట్ తో సిద్ధమవుతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమా తరువాత విజయ్ దేవరకొండ ఎలాంటి ప్రాజెక్టులు సెట్ చేసుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే శివ నిర్వాణతో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్న విజయ్ దేవరకొండ మరో రెండు ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నానికి లైఫ్ ఇచ్చిన దర్శకుడితో కూడా విజయ్ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Vijay devarakonda next movie with director mohan krishna indraganti

నానితో అష్టాచమ్మా, జెంటిల్ మెన్ వంటి సినిమాలు చేసిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ప్రస్తుతం V సినిమా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. అయితే ఆ సినిమా తరువాత విజయ్ తోనే ఒక ప్రయోగాత్మక సినిమా చేయాలని దర్శకుడు ఫిక్స్ అయ్యాడు. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాన్ని చెబుతూ విష్ చేయగా.. రీసెంట్ గా సోషల్ మీడియాలో విజయ్ కూడా స్పందించాడు.

తప్పకుండా మనం ఒక అద్భుతమైన వర్క్ చేయాలని కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఆడియెన్స్ కి కూడా క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది వీరి కాంబినేషన్ లో కొత్త సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X